Chiranjeevi: తెలుగు సినిమా చరిత్రలో ఓ చెరగని మైలు రాయి ‘‘మెగాస్టార్ చిరంజీవి’’. ఓ సాధారణ నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. తెలుగు సినిమాను ఏలే స్థాయికి మెగాస్టార్ ఎదిగిన తీరు ఓ మహా అద్భుతం. శ్రమ నీ ఆయుధమైతే.. విజయం నీ సొంతం అవుతుందనటానికి చిరంజీవి నిలువెత్తు నిదర్శనం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి.. ‘‘బిగ్గర్ దాన్ ది బచ్చన్’’గా నిలిచారంటే.. అందుకు ఆయన అకుంటిత దీక్షే కారణం. చిరును స్పూర్తిగా తీసుకుని ఎంతో మంది సినిమాల్లోకి వచ్చారు. స్టార్లుగా ఎదిగినవారు కూడా ఉన్నారు. అలా ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన మెగాస్టార్ పుట్టిన రోజు నేడు. మెగాస్టార్ పుట్టిన రోజును పురస్కరించుకుని సినీ, రాజకీయ, మీడియా వర్గాలనుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుమన్ టీవీ మీడియా అధినేత, సీఈఓ సుమన్.. చిరంజీవికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ తెలుగు సినిమా రారాజు పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. గత 30 ఏళ్లుగా అన్ని జెనరేషన్స్‌కు మీరే నిజమైన స్పూర్తి. మీ నిబద్ధత, క్రమ శిక్షణ, ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండే తత్వం మీ పేరును చరిత్రలో చెరిగిపోని సువర్ణాక్షరాలతో లిఖించేలా చేశాయి. నేటి యువతకు మీ జీవితం స్పూర్తిదాయకం. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎప్పటికీ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్‌గా ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. ఇక, సుమన్ టీవీ.. మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకల్ని సోచ్ అనే అంధులు, అనాథల ఆశ్రమంలో నిర్వహించింది. అక్కడ ఉండే వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. వారికి నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను అందించింది. అంతేకాదు! కేక్ కటింగ్‌తో పాటు కడుపునిండా వారికి భోజనం పెట్టింది. ఇవి కూడా చదవండి : Chiranjeevi: కవిత రూపంలో చిరుకు బర్త్‌డే విషెష్ చెప్పిన నటుడు ఉత్తేజ్!