పవర్ స్టార్ కు హార్ట్ ఎటాక్.. ఆందోళనలో అభిమానులు!

పవర్ స్టార్ కి హార్ట్ ఎటాక్.. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పవర్ స్టార్ కి హార్ట్ ఎటాక్ రావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.. తమ అభిమాన నటుడు ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.

srige minఇంతకీ ఆ పవర్ స్టార్ ఏవరా అనుకుంటున్నారా? మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదండీ.. తమిళ యాక్టర్, డాక్టర్ పవర్ స్టార్ శ్రీనివాసన్. తమిళ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పిలవబడే శ్రీనివాసన్ పలు చిత్రాల్లో హీరోగా నటించారు.. తర్వాత కమెడియన్ గా నటిస్తున్నారు. కాగా, పవర్ స్టార్ శ్రీనివాసన్ కు ఉన్నఫలంగా హార్ట్ ఎటాక్ రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. హై బ్లడ్ ప్రెజర్ కారణంగా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చిందని కుటుంబసభ్యులు తెలియజేస్తున్నారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది.

srnig min

శ్రీనివాసన్ మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీకి లతిక అనే సినిమా ద్వారా అడుగు పెట్టారు. ‘కన్న లడ్డు, ఆర్య సూర్య, లీడర్, వళ్లవంకు పుల్లమ్ ఆయుధమ్, ఐ, వలిప రాజా’ లాంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు. అయితే ఓ ఫ్రాడ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన.. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. విభిన్న కథాంశాల చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తర్వాత కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ‘పికప్ డ్రాప్’ మూవీ చేస్తున్న పవర్ స్టార్.. తనే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.