న్యూస్‌ యాంకర్‌గా మారిన శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌!

pellisandandi

రోషన్‌.. సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు. నిర్మలా కాన్వెంట్ సినిమాతో టీనేజ్ హీరోగా పరిచయం పరిచమయ్యాడీ యంగ్ హీరో. నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016 విడుదలై అప్పట్లో మంచి విజయాన్నే సాధించింది. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత రోషన్ డైరెక్టర్ రాఘవేందర్ రావు దర్శకత్వ పర్యవేక్షణలో సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న పెళ్లిసందD సినిమాతో మరోసారి ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు.

ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక 25 సంవత్సరాల పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా రూపోందిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇక విషయం ఏంటంటే..? ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15 విడుదల చేసేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

pellisandandi 2చిత్ర ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ సరికొత్తగా ముందుకు వెళ్తోంది. ఇక రోషన్ ఏకంగా న్యూస్ యాంకర్ గా మారి పెళ్లి సందడి పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయానే తరహాలో ఓ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. మూవీ యూనిట్ వినూత్న ఆలోచనతో ప్రమోషన్ లో అడుగు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Aditya Music (@adityamusicindia)