సినిమాగా సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర.. డైరెక్టర్ ఎవరో కాదు..!

ganguly biopic

సౌరవ్ గంగూలీ.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులుండరంటే అతిశయోక్తి కాదు. టీమిండియా క్రికెట్ లో అంచెలంచెలుగా ఎదిగి చెరిగిపోని స్థానాన్ని లిఖించుకున్నాడీ డైనమిక్ క్రికేటర్. ఆటగాడిగానే కాకుండా, కెప్టెన్ గా తన ప్రస్థానాన్ని ఏర్పారుచుకున్నారీ బెంగాల్ టైగర్. గంగూలీ ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఇక విషయం ఏంటంటే..? కొన్నాళ్ల నుంచి గంగూలీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రానుందని వార్తలు మాత్రం జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి నిజమనేటట్లుగా ఓ వార్త మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇక దాదా బయోపిక్ కు బాలీవుడ్ డైరెక్టర్ లవ్ రంచన్ దర్శకత్వం వహించనుండగా లవ్ ఫిలీంస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఇక ఎన్నో ఘట్టాలను దాటొచ్చి క్రికెట్ చరిత్రలో గంగూలీ పేరు ఓ సంచలనమనే చెప్పాలి. అయితే దాదా బయోపిక్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారోనని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక గంగూలీ బయోపిక్ తెరకెక్కనున్న తరుణంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.