కరోనా సమయంలో సాయం కోరిన ప్రతి ఒక్కరికి చేయూతనందిస్తూ.. పిలిస్తే పలికే దైవంగా మారారు నటుడు సోనూ సూద్. బాధితులను ఆదుకోవడాకి ఏకంగా ఆస్తులను సైతం తాకట్టు పెట్టారు సోనూ సూద్. అంతేకాక సోషల్ మీడియా వేదికగానూ ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు సోనూసూద్. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదని తెలిసినా.. సర్జరీలు వంటివి అత్యవసరం ఉండి.. ఆర్ధిక పరిస్థితి బాలేదని ఆయన దృష్టికి వస్తే… వెంటనే స్పందించి, వాళ్లకు చికిత్స అందేలా చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఓ బాలుడికి సోనూ ఫౌండేషన్ ద్వారా హార్ట్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు అంటూ కుటుంబ సభ్యులు సోనూసూద్‌కి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన ఓ నెటిజన్ తనను తాను భార్యాబాధితుడిగా పేర్కొంటూ తన భార్యకు కూడా ట్రీట్మెంట్ కావాలంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు. అందుకు సోనూ సూద్ అల్టిమేట్ రిప్లై ఇచ్చాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: యువకుడి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో సోనూసూద్‘‘సోనూ సూద్ భాయ్.. మీరు చికిత్స అవసరం ఉన్న ప్రతివారికి సాయం చేస్తున్నారు. అలానే నాకు సాయం చేయండి. నా భార్య.. నా రక్తం తాగుతోంది. ఈ జబ్బుకు ఏదైనా చికిత్స ఉందా.. ఉంటే.. దయచేసి వెంటనే నాకు సాయం చేయ్ సోదరా.. ఓ భార్య బాధితుడిగా.. చేతులు జోడించి మరి మిమ్మల్ని ఈ సాయం కోరుతున్నాను’’ అంటూ ట్వీట్ చేశాడు.
దీనికి సోనూ సూద్ కూడా అంతే ఫన్ని రిప్లై ఇచ్చాడు. ‘‘అరే భాయ్ అది ప్రతి భార్య జన్మహక్కు.. మీరు కూడా నాలాగే అదే రక్తంతో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించండి’’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చి.. నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్విట్టర్ సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
यह हर बीवी का जन्म सिद्ध अधिकार है भाई,
मेरी मानो उसी खून से एक ब्लड बैंक खोल लो 🤣 https://t.co/bXOPLzDS74— sonu sood (@SonuSood) April 13, 2022