శృతిహాసన్‌.. ఏంటి మరీ ఇలా చేస్తున్నావ్‌! వీడియో వైరల్‌

sruthihassan kollywood chennai

శృతిహాసన్‌ తెలుగు, తమిళ్‌ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌. ది గ్రేట్‌ కమల్‌హాసన్‌ కూతురు. సౌత్‌ ఇండియాలో ఆమెను చాలా మంది అభిమానిస్తారు. అనేక విషయాల్లో చాలా బోల్డ్‌గా మాట్లాడే శృతి ధైర్యాన్ని మెచ్చుకునే వారు ఉన్నారు. ఏంటి మరీ ఇలా మాట్లాడుతుందని విమర్శించే వాళ్లు ఉన్నారు. సాధారణంగా శృతిహాసన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన పర్సనల్‌ లైఫ్‌ గురించిన చాలా విషయాలు షేర్‌ చేసుకుంటారు. ఎదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ సరదాగా గడిపిన సమయాన్ని వీడియో తీసి అభిమానులతో పంచుకుంటారు. అక్కడి వరకూ బాగానే ఉన్నా ఒక వీడియోపై మాత్రం నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె అభిమానులకు కూడా ఆ వీడియో అంతగా మింగుడుపడటం లేదు.

రీసెంట్ గా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ సంతను హజారికతో కలిసి చేసిన వర్కవుట్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిద్దరూ కలిసి రకరకాల ఆసనాలు, హోమ్ వర్కవుట్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీటిల్లో కొన్ని భంగిమలు చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాయి. తన బాయ్ ఫ్రెండ్ తో కలసి రెచ్చిపోతుంది.. అంటూ నెట్టింట్లో కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని వర్కవుట్స్ ని శృతి హాసన్ అవలీలగా చేసేస్తుంటే తన బాయ్ ఫ్రెండ్ మాత్రం చేయలేకపోవడం.. శృతి నేను విన్ అని అనడం.. లాంటి వాటితో ఫన్నీగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే వర్కవుట్స్ అయ్యాక.. హెల్తీ ప్రొటీన్ ఫుడ్ ని తీసుకోవడంతో పాటు ఫ్రైడ్ చికెన్ ను కూడా వీరిద్దరూ ఆస్వాదిస్తూ తిన్నారు. ఇక రీసెంట్ గా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి షాపింగ్ ఫోటోల్ని కూడా తన ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు. శృతి లేటెస్ట్ గా ప్రభాస్ కు జోడీగా సలార్ సినిమాలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. నెక్ట్స్ హిందీలో ఓ వెబ్ సిరీస్ లో కూడా శృతిహాసన్ నటిస్తున్నారు.