బిగ్ బ్రేకింగ్.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం!

actor nedumudi venu passed away

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలు ఎదుర్కొంటున్న కష్టాలు మామూలువి కాదు. ఆర్ధిక పరమైన నష్టాన్ని పక్కన పెడితే.. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది సీనియర్ నటులు కన్నుమూశారు. ఇక ఇప్పుడు కూడా ఈ వరుస మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో లెజండ్రీ యాక్టర్ లివర్ సంబంధిత వ్యాధితో మరణించడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

ప్రముఖ మలయాళ నటుడు, నేషనల్‌ అవార్డు విన్నర్‌ నెడుముడి వేణు సోమవారం తుది శ్వాశ విడిచారు. 73 ఏళ్ల వేణు గత కొన్ని రోజులుగా తిరువనంత పురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లివర్‌ సంబంధిత వ్యాధి చికిత్స అందుకుంటున్నారు. అయితే.. వయసు రీత్యా ఆయన శరీరం ట్రీట్మెంట్ కి సహకరించపోవడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ నేపథ్యంలోనే నెడుముడి వేణు ఈ సోమవారం కన్నుమూశారు.కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

నెడుముడి వేణు నటనా జీవితంలో చాలానే మైలు రాళ్ళని అందుకున్నారు. ఓ సాధారణ థియేటర్‌ ఆర్టిస్ట్‌గా ఈయన కెరీర్ ప్రారంభం అయ్యింది. తరువాత 1978లో విడుదలైన థంబు చిత్రంతో వేణు సినిమా ప్రయాణం మొదలైంది. ఈ మొత్తం ప్రస్థానంలో వేణు.. మలయాళం, తమిళంతో పాటు దాదాపు 500 సినిమాల్లో నటించారు. తెలుగులోకి డబ్‌ అయిన కొన్ని తమిళ సినిమాల ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.ఇక మూడు నేషనల్‌ అవార్డ్స్‌, 7 రాష్ట్ర స్థాయి అవార్డ్స్ నెడుముడి వేణు సొంతం.ఇంతటి సీనియర్ నటుడు మరణవార్తతో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. తెలుగు, మలయాళం, తమిళ ఇండస్ట్రీకి చెందిన అభిమానులు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.