హిట్ కాని సినిమాకి యూ ట్యూబ్ లో 100 మిలియన్ హిట్స్!

విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం 96. సూప‌ర్ హిట్ అయిన ఈ సినిమాకు తెలుగు రీమేక్ గా జాను చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా నటించింది. కానీ త‌మిళ్ లో స‌క్సెస్ అయినంతగా తెలుగులో హిట్ కొట్ట‌లేదు.

download 4

లైఫ్ ఆఫ్ రామ్ పాట మాత్రం తెలుగు ప్ర‌జ‌ల నోళ్ల‌లో మార్మోగిపోయింది. ‘ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా.. ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా..’ అంటూ సాగిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. సింగర్ ప్రదీప్ కుమార్ తన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోసాడు. ఇదిలా ఉండగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయబడిన ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.

images 2

తాజాగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించి కొత్త ఘనతను సాధించింది. ప్రస్తుతం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మరో హీరోగా సిద్ధర్థ్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుత షూటింగ్ దశలో ఉంది. ఇదే క్రమంలో కిశోర్ తిరుమల తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here