బాలీవుడ్ కండల వీరుడికి ప్రాణ భయం పట్టుకుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. దానికి కారణాలూ లేకపోలేదు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో సల్మాన్ తాజాగా లైసెన్స్ ఉన్న గన్ తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం సల్మాన్ తీసుకున్న మరో నిర్ణయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ 2007లో కృష్ణ జింకను వేటాడాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడిపై కోర్టులో విచారణ కూడా కొనసాగుతోంది. దీంతో అప్పటి నుంచి సల్మాన్ ను హత్య చేయాలని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నిస్తోంది. ఈక్రమంలోనే సల్మాన్ ఖాన్, అతడి తండ్రి సలీమ్ ఖాన్ లను చంపుతామని బెదిరింపు లేఖను కూడా రాసింది. ఆ లేఖలో పంజాబ్ సింగర్ మూసేవాలకు పట్టిన గతే నీకూ పడుతుంది అని రాశారు. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు అనుమానాస్పందగా ఓ వాహనం ఉండటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే సల్మాన్ భాయ్ తాజాగా ముంబాయి పోలీసులను ఆశ్రయించాడు. దాంతో అతనికి భద్రతను పెంచారు. అదీ కాక తనకు ఉన్న ప్రాణహాని దృష్ట గన్ లైసెన్స్ ను సైతం ఆయన పొందారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఈక్రమంలోనే సల్మాన్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ఫ్రూప్ కారులో ప్రయాణించడం మొదలుపెట్టాడు. తాజాగా ఈ కారులో ప్రయాణిస్తూ కెమెరాకు చిక్కాడు. దీని ధర సుమారు రూ.1.5 కోట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు సల్మాన్ ఆ కారులో తిరిగే ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలోనే సల్మాన్ ఈ కారును కొనుగోలు చేసినట్లు అతని సన్నిహితులు చెప్తున్నారు. మరి సల్మాన్ ఖాన్ బుల్లెట్ ఫ్రూప్ కారు కొనడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Pavitra Lokesh: రెమ్యూనరేషన్ పెంచేసిన పవిత్ర లోకేష్.. రోజుకు ఎంతంటే? ఇదీ చదవండి: జబర్దస్త్ కు బాయ్ చెప్పాక అనసూయ పోస్ట్! నన్ను మిస్ అవుతుందేమో అంటూ..!