సినీ ప్రేక్షకులకు నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటిగానే కాకుండా కొంతకాలంగా వార్తల్లో పవిత్ర లోకేష్ పేరు బాగా వినిపిస్తుంది. సీనియర్ నటుడు నరేష్ నాలుగో పెళ్లి వార్తలతో వెలుగులోకి వచ్చిన పవిత్ర.. అప్పటినుండి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవిత్ర కన్నడ ఇండస్ట్రీకి చెందినప్పటికీ, ఇప్పటివరకూ తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. గతంలో హీరోయిన్ గా కూడా పవిత్ర పలు సినిమాలు చేయడం విశేషం. అయితే.. తాజాగా పవిత్ర తన రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు బయటికి వస్తున్నాయి. పవిత్ర లోకేష్ కన్నడలో హీరోయిన్ గా పాపులర్ అయినా.. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలకు తల్లిగా నటించి పేరు సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం.. పవిత్ర ప్రస్తుతం పారితోషకం కూడా భారీగా పెంచేసిందట. ఆమె పారితోషకం విషయానికి వస్తే.. కొంతకాలం క్రితం వరకు రోజుకు 60 వేల రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకునేదని.. ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా.. పవిత్ర లోకేష్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రోజుకు లక్ష రూపాయలు పారితోషకం అందుకుంటుందనే వార్త సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు గానీ.. పవిత్ర లోకేష్ కు ఆఫర్లు రావడానికి నటుడు నరేష్ కూడా తన వంతు సాయం చేస్తున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి పవిత్ర లోకేష్ పర్సనల్ విషయాలు పక్కన పెడితే.. ఆమె రెమ్యూనరేషన్ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.