వీడియో: చిన్నారి మాటలకి ఫిదా అయిపోయిన సాయిపల్లవి

Saipallavai is a child who stole the mind!

‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి, యువకుల మనసు దోచుకున్న నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. మలయాళంలో నటించిన మొదటి సినిమా “ప్రేమమ్” తో అక్కడి ప్రజల ప్రేమాభిమానాలను పొందింది సాయిపల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన అందంతో, నటనతో కుర్రకారు మనసును కొల్లగొట్టింది. ఈ బ్యూటీ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పల్లవి.. తన  డ్యాన్స్ తో చిన్నారుల నుంచి మొదలుకొని పెద్ద వాళ్ల వరకు అన్ని ఏజ్ ల వారిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించింది. తాజాగా ఓ చిన్నారితో సాయిపల్లవి చేసిన సందండి చేసింది. ఆ చిన్నారితో ముచ్చట్లు పెట్టింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాయిపల్లవి అందరితో కలిసిపోయే మనసత్వం అని చాలామంది సినిమా వాళ్లు చెప్పే అభిప్రాయం. ఆమెకు దైవ భక్తి కూడా ఎక్కువే. సినిమాలు, కథల విషయంలో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు తాను చేసిన అనేక ప్రతి సినిమాలు విభిన్నమైన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో తన పాత్ర సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంది. మన తెలుగు అమ్మాయి అనే అంతలా ఇక్కడి వారితో కలిసిపోయింది. సాయి పల్లవికి చిన్న పిల్లలు అంటే అమితమైన ఇష్టం. తాజాగా ఓ చిన్నారితో తెగ ముచ్చట్లు వేసింది.

 Saipallavai is a child who stole the mind!

ఆ వీడియోలో చిన్నారి తల్లిదండ్రులు మీరంటే పాపకు చాలా ఇష్టం అని సాయిపల్లవితో అనడం కనిపిస్తోంది. అనంతరం సాయిపల్లవి..చిన్నారిని దగ్గరకు తీసుకుని.. నా పేరు ఏమిటని అడుగుతుంది. దీంతో చిన్నారి.. సాయిపల్లవి అని అంటుంది. దీంతో పల్లవి చాలా ఆశ్చర్యానికి గురవుతుంది. ఇష్టమైన పాట ‘సారంగదరియా’ అని ఆ చిన్నారి చెప్తుతుంది. ఆ పాపను సాయిపల్లవి తన మీద కూర్చు పెట్టుకుని అనేక ముచ్చట్లు చెప్తుతుంది. ఇలా వారి మధ్య జరిగిన సంభాషణ అందరిని ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.