ప్రమాదం తర్వాత ఫస్ట్‌టైం పేస్‌బుక్‌లో స్పందించిన సాయిధరమ్‌ తేజ్‌

Sai Tej Respond on His Trailer - Suman TV

బైక్‌ స్గిడ్‌ అయ్యి ప్రమాదానికి గురైన సాయి ధరమ్‌ తేజ్‌ ఎట్టకేలకు కోలుకుని అభిమానులకు చిన్న అప్‌డేట్‌ ఇచ్చాడు. తన అప్‌ కమింగ్‌ మూవీ ‘రిపబ్లిక్‌’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. దీంతో సాయి ధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకున్నాడని ఆయన అభిమానులు సంతోషపడుతున్నారు. ముందు ఆరోగ్యంపై శ్రద్ధపెట్టు సినిమాలు తర్వాత చేసుకుందాం అంటూ ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. ఇక ట్రైలర్‌ విషయానికి వస్తే రిపబ్లిక్‌ సినిమాలో తేజ్‌ కలెక్టర్‌గా నటిస్తున్నాడు. రమ్యక్రిష్ణ పవర్‌ఫుల్‌ విలన్‌గా కనిపించబోతున్నారు. గాడి తప్పిన పాలక వ్యవస్థను కార్యనిర్వహక, న్యాయ శాఖ కలిసి గాడిలో పెట్టే కథగా ఈ రిపబ్లిక్‌ ఉండబోతున్నట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రానికి దేవా కట్ట డైరెక్టర్‌. అక్టోబర్‌ 1వ తేదీన ఈ సినిమా ధియేటర్లలో విడుదల కానుంది.