బిగ్ బ్రేకింగ్: స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్

Good news Sai Dharam Tej who came to consciousness - Suman TV

మెగా హీరో.. సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ కావడంతో ఇటు సినీ పరిశ్రమ, అటు అభిమానులు అంతా షాక్ లో ఉండిపోయారు. రాత్రి యాక్సిడెంట్ జరిగిన సమయం నుండి ఇప్పటి వరకు కూడా చరణ్ స్పృహ లోకి రాలేదు. హెల్త్ బులిటిన్స్ విడుదలైన ప్రతిసారి తేజ్ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించారు డాక్టర్స్. కానీ.., సాయి తేజ్ మాత్రం స్పృహలోకి రాకపోవడంతో అంతా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఇక ఈ శనివారం మధ్యాహ్నం సమయంలో సాయి తేజ్ కి ట్రీట్మెంట్ అందిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో కూడా డాక్టర్స్.. ఎంత తట్టినా, ఎంత పిలిచినా సాయి ధరమ్ తేజ్ మాత్రం కళ్ళు తెరవలేదు. కానీ.., నొప్పితో ఆయన బాధపడుతున్న మూలుగులు మాత్రం ఆ వీడియోలో వినిపించాయి. అయితే.., ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చినట్టు తెలుస్తోంది.

Good news Sai Dharam Tej who came to consciousness - Suman TVసాయి తేజ్ కి యాక్సిడెంట్ అయినప్పటి నుండి.. ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హాస్పిటల్ లోనే ఉంటూ వస్తున్నారు. సుమారు ఒకరోజు తరువాత.. తేజ్ కాస్త స్పృహలోకి రావడంతో వైష్ణవ్ కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి.., ఈ గుడ్ న్యూస్ అందించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో కాల్ లో సాయి ధరమ్ తేజ్.. ఫ్యామిలీ మెంబర్స్ ని కళ్ళు తెరిచి చూశారట. అంతేగాక.., కుటుంబ సభ్యులతో సాయితేజ్ ‘నొప్పిగా ఉంది’ అని మాత్రమే మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ మాట కూడా అతి కష్టం మీద మాట్లాడినట్టు సమాచారం.

ఇక తేజ్ ని చూడటానికి కుటుంబ సభ్యులకి కూడా డాక్టర్లు అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఆ ఒక్క మాట మాట్లాడినా సాయి ధరమ్ తేజ్ పూర్తిగా స్పృహలోకి రావడానికి కాస్త సమయం పట్టవచ్చని సమాచారం. అయితే.., భయపడాల్సిన అవసరం లేదని, మన మెగా మేనల్లుడు వందకి వంద శాతం అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుస్తోంది. మరి.. తేజ్ ఇంకాస్త త్వరగా కోలుకోవాలని మీ విషెస్ ని కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.