‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదలైన ప్రతి చోట మూవీ భారీ కలెక్షన్లను కొల్లగొడుతోంది. ‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ సినిమాగా విడుదలై.. అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగంగా ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాగా, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సినిమా కూడా తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాక.. కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. తొలిరోజునే రూ. 150 కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లను సాధించి పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డులను సొంతం చేసుకుంది చిత్రం.
ఇది కూడా చదవండి: KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బ్యాగ్రౌండ్! ఎవరీ ప్రశాంత్ నీల్?
ఇక రాఖీ భాయ్ వయోలెన్స్ కు అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో KGF ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ విడుదల డేట్ ఫిక్స్ చేశారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే ‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ ఓటిటిలో స్ట్రీమ్ అవ్వనుందని సమాచారం. మే 13న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ సినిమాను అప్పుడే ఓటీటీలో విడుదల చేయబోరని యష్ అభిమానులు అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ మేకర్స్ నుంచి ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన రావాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సినిమాల్లో కూడా ఈ రాజకీయాలేంటో..?: ప్రకాష్ రాజ్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.