NTR: సాధారణంగా తెలుగు హీరోకు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం అనేది మామూలే. అదే తెలుగు హీరోకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంటే.. గొప్ప విషయమనే చెప్పాలి. కానీ.. అదే తెలుగు హీరోకి స్వదేశంలో కాకుండా విదేశాలలో క్రేజ్ ఏర్పడితే.. అది ఖచ్చితంగా దేశం గర్వించే విషయమే అవుతుంది. ఎందుకంటే.. ఒక తెలుగు హీరో గురించి పాన్ ఇండియా దాటి.. దేశంకాని దేశాలు మాట్లాడుతున్నాయంటే.. మామూలు విషయం కాదు. తాజాగా ఇలాంటి గొప్ప క్రెడిట్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి దక్కింది. ఇటీవల ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి.. మూడు నెలల కిందట ఇండియన్ బాక్సాఫీస్, అమెరికా లాంటి దేశాలే మాట్లాడుకున్నాయి. అదీగాక.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000కోట్లు కొల్లగొట్టి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ కి పాన్ ఇండియా క్రేజ్ వరించింది. ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ కి ముందే ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పలు దేశాలలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాలకు జపాన్లో మంచి క్రేజ్ ఉంది. సూపర్ స్టార్ రజనీ తర్వాత జపాన్ లో ఫ్యాన్స్ కలిగిన సౌత్ హీరోలలో ఎన్టీఆర్ పేరు మొదటి వరుసలోనే ఉంటుంది. అయితే.. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాతో అంతకుమించిన క్రేజ్.. ఎవరూ ఊహించని దేశాలలో కూడా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాకు విడుదలై మూడు నెలలైనా విదేశాలలో అభిమానులు పుట్టుకొస్తూనే ఉన్నారు. అలాగే ఈ సినిమాపై, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటనపై హాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. అది ఇండియన్ మీడియా కాదు.. ఇజ్రాయెల్ మీడియా. ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్.. గోండుజాతి వీరుడు 'కొమరం భీం' పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. కొమరం భీంగా ఎన్టీఆర్ వేషభాషలకు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రేక్షకులు సైతం బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన కొమరం భీం పాత్రపై ఇజ్రాయిల్ దేశంలోని ఓ ప్రముఖ పత్రికలో ఏకంగా ఓ స్పెషల్ ఎడిషన్ ప్రచురించారు. ఈ ఎడిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. అక్కడ పేపర్లో ఓ పేజీ అంతా ఎన్టీఆర్ పెర్పామెన్స్ అదిరిపోయిందని చెపుతూ, ఎన్టీఆర్ క్యారెక్టర్ పిక్స్ స్పెషల్ గా వేశారు. దేశం కాని దేశం.. మనది కానీ భాషలో న్గత్ర్ గురించి ప్రత్యేక కథనం రావడం అంటే.. అక్కడివారు ఎన్టీఆర్ నటనను ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఎన్టీఆర్ స్పెషల్ ఎడిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. Unreal Craze Of @tarak9999 In Israel Regarding RRR Movie Who Ever Said NTR Is A Universal Star Very Well Said pic.twitter.com/oo0l4nqk2E — Troll Hard (@TeamTrollHard) June 18, 2022