రీతూ చౌదరి.. సీరియల్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే అటు కామెడీ షోస్ లో కూడా మెరుస్తోంది. ఇటీవలే రీతూ చౌదరి ఓ ఖరీదైన కారు కూడా కొనుగోలు చేసింది. సీరియల్స్, సోషల్ మీడియా కన్నా.. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోస్ లో అడుగుపెట్టాకనే రీతూకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మొన్నీ మధ్య ఓ వ్యక్తిని లవ్ చేస్తున్నా అంటూ చెప్పింది, గతంలో జబర్దస్త్ స్టేజ్ పై అజార్ అంటే ఇష్టం అ చెప్పింది. అదే ప్రశ్నను శ్రీదేవీ డ్రామా కంపెనీలో నూకరాజు అడిగాడు. మొదట ఆ ప్రశ్నకు అవాక్కు అయిన రీతూ తేరుకుని అందుకు సమాధానం కూడా చెప్పింది.
రీతూ చౌదరి తన ప్రేమ గురించి చెబుతూ.. ‘ఆ ఛానల్ లో వేరొక వ్యక్తికి చెప్పింది, అజార్ కి చెప్పింది అభిమానంతో.. అది ప్రేమ కాదు. కానీ, నేను నిజంగానే ఒకరిని ప్రేమిస్తున్నాను, అతను కూడా ఇక్కడే ఉన్నాడు’ అంటూ ఆది చేయి పట్టుకుని స్టేజ్ మీదకు తీసుకెళ్తుంది. ఆది ఐ లవ్ యూ అంటూ మోకాళ్లపై కూర్చొని ఆన్సర్ కోసం ఎదురు చూసింది.
కానీ, ఆది మాత్రం నాకు అలాంటి ఉద్దేశం లేదు, నేనుప్పుడూ అలా అనుకోలేదు అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే ఇదంతా టీఆర్పీ స్టంట్ అని వాళ్లే చెప్పేశారు. టీఆర్పీ కోసం నేను ఆదికి ఐ లవ్ చెప్పాను కానీ, ఆయన మీద రెస్పెక్ట్ ఉన్న మాట వాస్తవం అంటూ రీతూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టీఆర్పీ స్టంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.