సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ రివ్యూ

republickmovietalk saidharamtej aishwaryarajesh devakatta

తెలుగు సినిమా చరిత్రలో ప్రస్థానం మూవీకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు దేవాకట్టా. కారణాలు ఏవైనా తరువాత కాలంలో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ గాడి తప్పాడు. కానీ.., ఇప్పుడు ఓ పదునైన ఆలోచనతో రిపబ్లిక్ అనే మూవీ తెరకెక్కించారు దేవాకట్టా. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన రిపబ్లిక్ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. రిపబ్లిక్ మూవీ ఎలా ఉందొ ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

republickmovietalk saidharamtej aishwaryarajesh devakatta

కథ:
తన తండ్రి అవినీతితో డబ్బు సంపాదించడం చూస్తూ పెరుగుతాడు పంజా అభిరామ్ (సాయి తేజ్). తాను సమాజంలోని ఈ పరిస్థితిని మార్చాలి అనుకుంటాడు. ఎంతో కష్టపడి కలెక్టర్ అవుతాడు. అయితే.. అప్పటికే తెల్లేరు సరస్సు ప్రాంతాన్ని అంతా రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు ఆక్రమించుకుంటూ వస్తుంటారు. దీన్ని అడ్డుకునే క్రమంలో అభిరామ్ కి ప్రాంతీయ పార్టీ అధినేత్రి విశాఖ వాణి (రమ్యకృష్ణ) ఎదురవుతుంది. ఆమె తన కొడుకును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుంది. ఇక్కడ నుండి పంజా అభిరామ్ (సాయి తేజ్) రాజకీయ నాయకురాలు విశాఖ వాణికి మధ్య ఎలాంటి వార్ జరిగింది? కొంతమంది నాయకులు, అధికారులు తప్పులు చేస్తూ వ్యవస్థని ఎలా నాశనం చేస్తున్నారు అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ:

ఓ బలమైన కథని చెప్పాలి అనుకున్నప్పుడు కథలోని ఆయా పాత్రలను కూడా అంతే బలంగా తీర్చి దిద్దాల్సి ఉంటుంది. ఈ విషయంలో దేవాకట్టా మరోసారి సూపర్ సక్సెస్ అయ్యారు.

  • అవినీతి పరుడైన తండ్రిని కాదని స్వయంకృషితో ఎదిగే ఓ కొడుకు
  • ఆ తండ్రి అవినీతి పరుడుగా మారడానికి ఓ బలమైన కారణం
  • వ్యవస్థను ప్రశ్నించే రీతిలో హీరోయిన్ పాత్ర
  • నిజాయితీ పరుడిగా తన తండ్రి సాధించలేకపోయిన అధికారాన్ని అడ్డదారులు తొక్కి సాధించే కూతురుగా విశాఖవాణి పాత్ర

ఇలా రిపబ్లిక్ మూవీలో ప్రతి పాత్రకి ఒక మోటివ్ ఉంటుంది. దీంతో.., కథ చెప్పే సమయంలో దర్శకుడుకి ఎక్కడా తడబాటు పడాల్సిన పరిస్థితి ఎదురుకాలేదు.ఇదే రిపబ్లిక్ మూవీకి అతి పెద్ద బలం అయ్యింది.

republickmovietalk saidharamtej aishwaryarajesh devakatta

రిపబ్లిక్ మూవీ కోసం సాయి తేజ్ ప్రాణం పెట్టేసి నటించాడు. దేవాకట్టా కన్నా ఎక్కువగా తేజ్ ఈ కథని నమ్మాడని సినిమా చూస్తుండగానే అర్ధం అయిపోతుంది. ఎన్.ఆర్.ఐ యువతిగా ఐశ్వర్య రాజేశ్ నటనకి ప్రేక్షకులు స్పెల్ బౌండ్ అవ్వడం గ్యారంటీ. అన్నిటికీ మించి విశాఖ వాణి పాత్రలో రమ్యకృష్ణ నటనకి హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక జగపతిబాబుకి చాలా రోజులు తరువాత మోటివ్ ఉన్న క్యారక్టర్ దొరకడంతో దుమ్ము దులిపేశాడు.

 

 

ఇక రిపబ్లిక్ కథ సామజిక పరిస్థితికి అడ్డం పట్టే కథ కాబట్టి, దర్శకుడు డైలాగ్స్ ని కూడా అంతే వెయిట్ ఉండేలా రాసుకున్నాడు. ఆ స్థాయి డైలాగ్స్ ప్రేక్షకులకి ఎంత వరకు అర్ధం అవుతాయి అన్నది మాత్రం కాస్త ఆలోచించాలి. కానీ.., చెప్పాలి అనుకున్న పాయింట్ ని ఎక్కడా డీవియేట్ అవ్వకుండా దేవాకట్టా పెర్ఫెక్ట్ గా చెప్పడం అభినందించతగ్గ విషయం. ఓవరాల్ గా అయితే రిపబ్లిక్ ఓ జెన్యూన్ అటెంప్ట్. కానీ.., సాధారణ ప్రేక్షకుడు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో లేవు. సినిమాలో వాటిని పెట్టడానికి ఆస్కారం లేదు కూడా. మరి.. దీనిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక టెక్నీకల్ గా, నిర్మాణ విలువల పరంగా రిపబ్లిక్ మూవీ స్థాయి ఎక్కడా తగ్గలేదు.

republickmovietalk saidharamtej aishwaryarajesh devakatta

ప్లస్ పాయింట్స్ :

  • కథ
  • ప్రధాన తారాగణం నటన
  • అద్భుతమైన డైలాగ్స్
  • దేవాకట్టా దర్శకత్వ ప్రతిభ

మైనస్ పాయింట్స్

  • సరస్సు చుట్టూ కథని ఎక్కువ నడిపించడం
  • రొటీన్ పొలిటికల్ డ్రామాని తలపించే క్లైమ్యాక్స్

చివరి మాట: జెన్యూన్ పొలిటికల్ డ్రామా. దేవాకట్టా ఈజ్ బ్యాక్