కేక పుట్టిస్తున్న రామ్ చరణ్- శంకర్ మూవీ ఫస్ట్ పోస్టర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ షూట్ ని కంప్లీట్ చేసేశాడు. నెక్స్ట్ ఏంటి అంటే శంకర్ మూవీని పట్టాలు ఎక్కించడమే. అయితే.. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఎదురుచూపులకు బ్రేక్ పడింది. రామ్ చరణ్, శంకర్ సినిమా పూజా కార్యక్రమం ఈ బుధవారం వైభవంగా మొదలైంది. ఇక ఇదే సమయంలో మూవీ యూనిట్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ పోస్టర్ ని విడుదల చేసింది.

Ram Charan and Shankar Movie Launched - Suman TVఈ పోస్టర్‌లో మూవీ టీమ్ అంతా బ్లాక్ సూట్‌లు ధరించి.., చేతిలో ఫైల్స్ , బ్యాగ్‌లతో కనిపిస్తున్నారు. ఇందులో దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు కూడా కనిపిస్తుండటం విశేషం. దీంతో.. ఇదేదో రజనీకాంత్ “శివాజీ” మూవీని మరిపించే.. సోషల్ కాజ్ ఉన్న సినిమాగా అర్ధం అవుతోంది.

Ram Charan and Shankar Movie Launched - Suman TVప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ కి ఒక భారీ హిట్ అత్యవసరం. దీంతో.. ఈ ప్రాజెక్ట్ ని శంకర్ సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోవడంతో.. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు సమాచారం. మరి.. “మేము సిద్ధంగా ఉన్నాము, వచ్చేస్తున్నాము” అంటూ రిలీజైన ఈ పోస్టర్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.