నందమూరి నటసింహ అఖండ సినిమాతో ఫుల్ జోష్ తో ఉన్నారు. అఖండ సినిమాతో బాలయ్య రికార్ట్స సృష్టించాడు. ఇటు ఓటీటీలోనూ బాలకృష్ణ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఓటీటీ సంస్థ అయిన ఆహాలో అన్ స్టాపబుల్ విత్ NBK అనే షో ప్రసారంమవుతుంది. ఈ షో ద్వారా సెలబ్రిటీలను అన్ స్టాపబుల్ గా బాలయ్య ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ షో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ షో లో మంచు మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి వంటి సెలబ్రిటీలు సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఇక త్వరలోనే మహేష్ బాబు ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్కు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇదిలా ఉంటే.. బాలయ్య షోలో సందడి చేయడానికి హీరో రవితేజ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని రాబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 24న టెలికాస్ట్ కానున్నట్లుగా ప్రకటించారు. మరి మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపిచంద్ తో బాలయ్య ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ ఎపిసోడ్ పై మీ ఎక్సపెక్టషన్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.