పవన్ కళ్యాణ్ సినిమాలో రవీనా టాండన్..!

Raveenatandon

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలను, ఇటు రాజకీయాలను బ్యాలన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘భీమ్లా నాయక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా కంప్లీట్ చేస్తున్నాడు. ఆ సినిమా అనంతరం డైరెక్టర్ హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయనున్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత వీరి కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో పవన్ కి జోడిగా పూజా హెగ్డే కనిపించనుంది. తాజాగా ఈ మోస్ట్ అవైటింగ్ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. భవదీయుడు సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇటీవలే కేజీఎఫ్-2 సినిమాలో పవర్ ఫుల్ ‘ప్రైమ్ మినిస్టర్ రమికా సేన్’ రోల్ చేసి మెప్పించింది. అందులో ఆమె పండించిన విలనిజం చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.Pawankalyanతాజాగా దర్శకుడు హరీష్ శంకర్.. భవదీయుడు సినిమాలో కీలకపాత్ర కోసం రవీనాను సంప్రదించాడని.. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సినీవర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు కొత్తకాదు. గతంలో కొన్ని తెలుగు సినిమాలు చేసింది. అందులో బాలయ్య సరసన నటించిన ‘బంగారు బుల్లోడు’ మూవీ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత హిందీలో అవకాశాలు రావడంతో అక్కడే బిజీ అయిపోయింది. ఇక ఇన్నేళ్ల తర్వాత తెలుగులో రవీనా రీఎంట్రీ కన్ఫర్మ్ అయ్యిందని ఇండస్ట్రీ టాక్. మరి రవీనా టాండన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.