రష్మిక మందన్నా.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని వుడ్స్ లో రష్మీకా హవా నడుస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే రష్మిక బాలీవుడ్ డెబ్యూ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు పూర్తి చేసుకుని మూడో ప్రాజెక్టు కూడా రెడీ చేసుకుంది. అటు టాలీవుడ్ లోనూ సీతారామ్, పుష్ప-2 ప్రాజెక్టులు ఉన్నాయి. పుష్ప సినిమా తర్వాత శ్రీవల్లిగా పాన్ ఇండియన్ లెవల్లో రష్మికకు క్రేజ్ పెరిగిన విషయం తెలిసిందే. ఆ క్రేజ్ ను అందిపుచ్చుకుని బాలీవుడ్ లోనూ పాగా వేసింది.
రష్మిక మందన్నా మే 25న కరణ్ జోహార్ 50వ బర్త్ డే పార్టీకి హాజరైంది. రష్మిక సహా టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ, ఛార్మీ, పూరీ జగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా పాల్గొన్నారు. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక పార్టీకి వేసుకెళ్లిన డ్రెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రష్మిక ఆ బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఆ డ్రెస్సుతో రష్మిక కాస్త ఇబ్బంది పడుతూ కనిపించింది. అది చూసి ఇంకొందరు ఫ్యాన్స్.. అలవాటు లేనప్పుడు అలాంటి డ్రెస్సు వేసుకోవడం అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో మాత్రం రష్మిక మందన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచింది. ఆమె ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్మిక డ్రెస్సింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.