చిత్రసీమను దున్నేస్తున్న RRR చిత్రంపై పలువురి సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విడుదలకు ముందున్న అంచనాలను సైతం తలకిందులు చేస్తూ ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది జక్కన్న RRR. అయితే ఓ పక్క బాలీవుడ్ లోని కొందరు క్రిటిక్ లు ఈ సినిమాని విమర్శిస్తుంటే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ మాత్రం ప్రశంసలు కురిపించాడు.
ఇది కూడా చదవండి: నాలుగో రోజు అదే జోరు.. తొక్కుకుంటూ పోతున్న RRR!
తాజాగా స్పందించిన ఆయన భారతీయ సినిమా ఈ రేంజ్ లో విజయం సాధించడం చాలా గర్వంగా ఉందంటూ తెలిపాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను సైతం బీట్ చేస్తూ ముందుకు వెళ్తుందని అన్నాడు. ఇక దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడుతున్నాయని తెలిపాడు ఈ బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్. RRR మూవీపై రణ్ వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.