రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కాంట్రాక్ట్!..

ఆయన పేరు ఓ సంచలనం!. ఆయన మాట ఓ వివాదం. ముక్కుసూటి తనం ఆయన నైజం. ఆయన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కింగ్ నాగార్జున తో కలిసి వర్మ తెరకెక్కించిన శివ సినిమా టాలీవుడ్ లో హిస్టరీని క్రియేట్ చేసింది. అసలు సిసలైన మాస్ యాక్షన్ ను ఆడియన్స్ కు రుచిచూపించాడు వర్మ. అలాగే వివాదం ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ఉన్నట్టే. ఉన్నది ఉన్నట్టు చెప్పడం సినిమాల్లో చూపించడం ఆర్జీవీ స్టైల్. కరోనా లాక్ డౌన్ సమయంలో వర్మ ప్రేక్షకులను తన సినిమాలతో అలరించారు. వరుసగా ఓటీటీ వేదికగా సినిమాలను రిలీజ్ చేశారు ఆర్జీవీ. అసలు మీరు ఇలా ఎందుకు ఉంటారు అని చాలా ఇంటర్వ్యూల్లో ఆయన్ని అడిగారు. అందుకు సమాధానంగా ‘నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను, బతుకుతాను’ అని వర్మ స్పష్టంగా చెబుతారు. అయితే తన బతుకునే కాదు.. తన చావుని కూడా వర్మనే డిసైడ్ చేసుకున్నారట.

maxresdefault 7

తన చావు కూడా తన చేతిలోనే ఉందని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉండి ఒకరిపై ఆధారపడి బతికే పరిస్థితే తనకు వస్తే ఆ రోజు తనని చంపేయమంటూ ఇప్పటికే ఓ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చాను అని ఆయన స్పష్టం చేశారు. తన అనారోగ్యంతో మంచాన పడిన వెంటనే సదరు కిల్లర్ తనను చంపేస్తాడని ఆయన అన్నారు. ఇక ఒకవేళ తను మరణిస్తే, ఆ సమయంలో తన వద్దకు రావొద్దని, తన కోసం ఏడ్వాల్సిన అవసరం కూడా లేదని తన కూతురికి చెప్పాను అని ఆయన తెలిపారు. త్వరలో రామ్ గోపాల్ వర్మ ‘డీ కంపెనీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.