2022 మొదటి త్రైమాసికంలో విడుదలైన సినిమాల్లో ట్రిపులార్ మూవీ ఒక విజువల్ వండర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1200 కోట్లు కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో దర్శక ధీరుడు రాజమౌళి మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. కేవలం ఇండియన్ ఆడియన్స్ నుంచి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ట్రిపులార్ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అటు ఓటీటీలోనూ ట్రిపులార్ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. జీ5, నెట్ ఫ్లిక్స్ లో ట్రిపులార్ సినిమా చూసిన విదేశాల్లో ప్రేక్షకులు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాపై కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వెటకారంగా స్పందించాడు. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు తిడతాడో.. ఎప్పుడు పొగుడుతాడో ఎవరూ చెప్పలేరు. అయితే ఈసారి కాస్త శ్రుతి మించి మాట్లాడాడనే చెప్పాలి. ట్రిపులార్ సినిమాపై ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీ ఆర్టికల్ ను షేర్ చేస్తూ తన మాటలను సమర్థించుకున్నాడు. ఈ సినిమా గురించి నేనే ముందే చెప్పా చూశారా అంటూ ఎద్దేవా చేశాడు.
I was right 😎 “They are so gay’ Western audience’s perception of ‘RRR’ as a gay story https://t.co/OxVDVr5Qsp
— Ram Gopal Varma (@RGVzoomin) June 2, 2022
‘నేనే కరెక్ట్.. “వాళ్లు గేలు లాగా ఉన్నారు’ పాశ్చాత్య ప్రేక్షకులు ట్రిపులార్ సినిమా గే స్టోరీలా చూస్తున్నారు” అంటూ ట్వీట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ నేరుగా చెప్పకనే ఆ హెడ్డింగ్ ని కోట్ చేస్తూ నేనే కరెక్ట్ అని ఇన్ డైరెక్ట్ గా ట్రిపులార్ సినిమా గే స్టోరీ అని చెప్పానా.. అన్నట్లుగా కామెంట్ చేశాడు. ఆర్జీవీ ట్వీట్ పై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. వాళ్లకంటే భాష అర్థం కాదు.. నీకు వచ్చుగా నీకూ అలాగే అర్థమైందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొన్నాళ్లు పోతే ఫ్రెండ్ షిప్ అర్థాన్ని కూడా మార్చేస్తారేమో అంటూ అభిప్రాయ పడ్డారు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మీ మీద ఉన్న RESPECT రోజు రోజుకీ తగ్గిపోతుంది sir…
Reason is only YOU— AMAR BABU.YANANGI (@amarbabu27pspk) June 2, 2022
🤦 Friendship mata ki meaning maripothademo konni days lo
— Indira Shravani ( Mittemary Kedambi ) (@indira_shravani) June 2, 2022
Valaki ante lang prob niku endhi vodka esi mve chusava pic.twitter.com/s7DXtnEWqa
— uma_pspk❤️ (@umamaheshgandh2) June 2, 2022