అప్పుడు గుద్దులు.. ఇప్పుడు ముద్దులు అసలు ఏం జరుగుతోంది?

ashu rgv bold interview

వివాదాస్పద డైరెక్టర్‌.. కాంట్రవర్సీ కింగ్‌ ఈ పేర్లు వినగానే ఎవరైనా టక్కున ఆర్జీవీ అనేస్తారు. ఆయన క్రేజ్‌ అలాంటిది. ఒకప్పుడు స్టార్‌ డైరెక్టర్‌గా టాలీవుడ్‌, బాలీవుడ్‌లో వెలిగిన ఆయన ఇప్పుడు యూట్యూబ్‌లో వైరలవుతున్నారు. తన రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా బోల్డ్‌ ఇంటర్వ్యూలతో యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్నాడు ఆర్జీవీ. తాజాగా ఆయన లిస్టులోకి బుల్లితెర యాంకర్‌, బిగ్‌బాస్‌ బ్యూటీ అషూరెడ్డి కూడా చేరిపోయింది.

Ramgopal_ashu-reddyఓ కాఫీ షాప్‌లో ముక్కు, మొఖం తెలియని అందమైన అమ్మాయిని చూసిన వెంటనే పులిహోర కలుపుతూ.. మనసులోని భావాలను మొహమాటం లేకుండా చెప్తూ తన సహజసిద్ధమైన శైలితోనే ఈ బోల్డ్‌ ఇంటర్వ్యూ సాగింది. ఆర్జీవీ అంటే తెలియని ఓ అమ్మాయి, అతని బోల్డ్‌ మాటలకు ఒకింత ఆశ్చర్యం, ఒకింత అసహ్యం వంటి ఎన్నో హావభావాలను అషూరెడ్డి బాగా పలికించింది. ‘ఐ లవ్‌ యువర్‌ థైస్’ అని ఆర్జీవీ అనగానే అషూరెడ్డి లాగి లెంపకాయ కొడుతుంది. ‘మీ చేయి స్పర్శ నాకు తెలియాలనే కుట్ర పన్ని ఇలా చేశాను’ అని అసలు విషయం చెప్పగానే అషూరెడ్డి కాస్త శాంతించి ఇక ఆర్జీవీ మాటల గారడిని ఆశ్వాధించడం ప్రారంభిస్తుంది. ఈ ఇంటర్వ్యూలో బోల్డ్‌ అండ్‌ సెన్సార్‌ కట్స్‌ ఎన్నో ఉన్నాయి.

ashu rgv bold interviewఇంటర్వ్యూ అంతా అయిపోయాక అషూరెడ్డితో ఆర్జీవీ మాట్లాడిన ఓ క్లిప్‌ కూడా జత చేశారు. అందులో ‘ఒక్కసారి ప్లీజ్‌ ప్లీజ్‌’ అంటూ ఆర్జీవీ  బతిమాలుతుంటారు. అషూరెడ్డి మాత్రం ఇట్స్‌ ఏ బిగ్‌ నో ఆర్జీవీ ప్రపోజల్‌ను తిరస్కరిస్తుంది. కనీసం కన్సెషన్‌ అయినా ఇవ్వు అని కోరుకోగా.. ఇన్ని నోలు చెప్పిన తర్వాత ఇది ఒక చిన్న ఎస్‌ అంటూ ఆర్జీవీకి అషూరెడ్డి బుగ్గన ముద్దుపెట్టేసింది. ఈ బోల్డ్‌ ఇంటర్వ్యూ చూసిన ఆర్జీవీ అభిమానులు, అషూరెడ్డి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సదరు యూట్యూబ్‌ వాచర్‌ మాత్రం త్వరగా యూట్యూబ్‌కి కూడా సెన్సార్‌ కట్‌ తీసుకురావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో బోల్డ్‌ బ్యూటీ అరియానా కూడా ఆర్జీవీని ఇదే తరహాలో ఇంటర్వ్యూ చేసి వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. కానీ, అరియానా ఇంటర్వ్యూ, అషూరెడ్డి ఇంటర్వ్యూకి అసలు పోలికే లేదంటూ అంటున్నారు. మరి ఆ ఇంటర్వ్యూని మీరు కూడా చూసి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి.