జూనియర్ ఎన్టీఆర్– రామ్ చరణ్ నట విశ్వరూపానికి ట్రిపులార్ సినిమా సాక్షంగా నిలుస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాకి ముందు కూడా వారి నటన గురించి మనకు ఒక ఐడియా ఉంది. కానీ, రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులార్ సినిమాలో తారక్- రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహం, సోదర భావం ప్రేక్షకులకు తెలిసింది. వారి మధ్య కొన్నేళ్లుగా ఎంతో మంచి అనుబంధం ఉన్నా కూడా ప్రేక్షకులకు మాత్రం ట్రిపులార్ సినిమా తర్వాతే తెలిసిందే. ప్రమోషన్స్ లో వారి మధ్య బంధాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించారు. వారి మధ్య స్నేహం టాలీవుడ్ ఓ అద్భుతమైన మల్టీస్టారర్ కు బీజం వేయడమే కాదు.. టాలీవుడ్ లో జరిగే ఎన్నో ఫ్యాన్ వార్స్ కు ఫుల్ స్టాప్ పెట్టింది అని కూడా చెప్పొచ్చు.
జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా వారి మధ్య అనుబంధం ఎలాంటిదో మరోసారి రుజువైంది. జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన రామ్ చరణ్ వారి మధ్య బంధాన్ని మాటల్లో వర్ణించలేనంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘బ్రదర్, కోస్టార్, ఫ్రెండ్.. తారక్ నువ్వు నాకు ఏమౌతావో మాటల్లో వర్ణించలేను. మన మధ్య ఉన్న బంధాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను’ అంటూ రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ రిలేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Brother, co-star, friend … I don’t think words can define who you are to me @tarak9999 !
I will always always cherish what we have 🤗
Happy Birthday ! pic.twitter.com/CPHDUEzf6m— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2022
My next with Koratala Siva… https://t.co/iPyKSQ9Sjs pic.twitter.com/xaEB1ZbwON
— Jr NTR (@tarak9999) May 19, 2022