రామ్ చరణ్, శంకర్ క్రేజీ కాంబినేషన్.. రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేనా?

Ram Charan and Shanker Regular Shooting Starts - Suman TV

టాలీవుడ్ లో ఏదైన క్రేజీ కాంబినేషన్ మొదలవుతుందంటే ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కోసం అభిమనులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారన్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ లో ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్ ఎదైన ఉందా అంటే అది ఖచ్చితంగా రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ అని చెప్పక తప్పదేమో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైనమిక్ డైరెక్టర శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.

Ram Charan and Shanker Regular Shooting Starts - Suman TVఈ మూవీకి టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యే ఈ చిత్ర ప్రారంభోత్సవం కూడా అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో డైరెక్టర్ శంకర్, దిల్ రాజు, చరణ్ వీరి ముగ్గురి కలయికలో భారీ సినిమా రూపొందుతుండటంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందోనని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ నెల 21 తేదీ నుంచి మొదలవునుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.