మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగా ఇంటి వారసుడైనా.. చాలా సింపుల్‌గా ఉంటాడు. తన కోస్టార్లతో పాటు.. అందరితో చాలా క్లోజ్‌గా ఉంటాడు. తన సన్నిహితుల గురించి ఆలోచించడం, వారికి సాయం చేయడం, సర్‌ప్రైజ్ ఇచ్చే విషయంలో చెర్రి ఓ అడుగు ముందే ఉంటాడు. ట్రిపుల్ ఆర్ షూటింగ్ కోసం ఉక్రెయిన్ వెళ్లగా.. అక్కడ తమకు గైడ్‌గా వ్యవహరించిన వ్యక్తికి.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా సాయం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు రామ్ చరణ్. తన డ్రైవర్ బర్త్ డే రోజున అతనికి తెలియకుండా కేక్ కట్ చేయించి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఎప్పుడూ ఉండే తమతో పాటు ఉండే తమ స్టాఫ్ కోసం స్టార్స్ తమ కొద్దిపాటి టైం కేటాయిస్తుంటారు. రాం చరణ్ దగ్గర డ్రైవర్ గా చేస్తున్న నరేష్ బర్త్ డే సందర్భంగా అతనికి తెలియకుండా కేక్ కటింగ్ ప్రొగ్రాం ఏర్పాటు చేశారట. తన మిగతా స్టాఫ్ తో కలిసి రామ్ చరణ్ దగ్గరుండి మరి కేక్ కట్ చేయించాడు. ఈ సెలబ్రేషన్స్‌లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కూడా పాల్గొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
ఇది కూడా చదవండి: నేను చెప్పిందే నిజమైంది. RRR ఓ గే మూవీ! వైరల్ అవుతున్న RGV కామెంట్స్!
డ్రైవర్ నరేష్.. చరణ్ దగ్గర కొన్నేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.ఇక వ్యక్తిగత సిబ్బందిని బాగా చూసుకోవడంలో రామ్ చరణ్ ముందుంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని తెలుస్తుంది. తన డ్రైవర్ పుట్టినరోజు వేడుకల్లో సతీసమేతంగా చరణ్ పాల్గొనడం విశేషం. ఇక రామ్ చరణ్ చేసిన పనికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పనిచేసేవాళ్లను కూడా ఫ్యామిలీగా ట్రీట్ చేస్తాడంటూ చరణ్‌పై అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఇది కూడా చదవండి: Ram Charan: అభిమాని వినూత్నమైన గిఫ్ట్.. ఫుల్ ఖుషీ అయిన రామ్ చరణ్
సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ ధర్శకత్వంలో RC15 చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే, రామ్ చరణ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చిత్రానికి సంబంధించిన పనిని ప్రారంభించనున్నాడు. ‘జెర్సీ'(తెలుగు) విజయంతో మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్.. రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. చెర్రి చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజసేయండి.
Celebrates his personal car driver birthday…
He treats them as a family ❤️❤️🙏👑
King @AlwaysRamCharan #RamCharan pic.twitter.com/iaTmYNLISy
— Sᴀɱ JօղVíƙ™ (@Sam_Jonvik2) June 5, 2022
ఇది కూడా చదవండి: Manushi: కోరిక బయటపెట్టిన మిస్ వరల్డ్.. రామ్ చరణ్ తో డేట్..!