సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమాపై ఇటు ఫాన్స్ లో, అటు ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్న సంగతి తెలిసిందే. మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ కాగా, గీతగోవిందం ఫేమ్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే.. ఇటీవలే విడుదలైన ‘సర్కారు వారి పాట ట్రైలర్’ సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి.
ట్రైలర్ లో మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ నుండి డైలాగ్ డెలివరీ వరకూ అన్నీ కొత్తగా, మాస్ లెవెల్లో ఉండేసరికి ఫ్యాన్స్ లో పూనకాలు మొదలైపోయాయి. అయితే.. మహేష్ బాబు నుండి ఫస్ట్ మాస్ యాంగిల్ బయటికి తీసింది మాత్రం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలతో మహేష్ లోని టోటల్ ఎనర్జీని, ఇంటెన్సిటీని తెరపై చూపించి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ పరశురామ్.. మహేష్ లోని ఎనర్జీ, ఇంటెన్సిటీ, టైమింగ్ ని కరెక్ట్ గా వాడుకున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్ అయ్యాక మహేష్ అక్కడక్కడా పోకిరి స్టైల్ లో కనిపించినట్లు కామెంట్స్ కూడా వినిపించాయి. దానిపై పరశురామ్ కూడా స్పందించి అలాంటిది ఏం లేదని స్పష్టం చేశాడు. అయితే.. సర్కారు వారి ట్రైలర్ విడుదలయ్యాక ఎంతమంది ఎలా రియాక్ట్ అయినా.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ రియాక్షన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
సర్కారు వారి పాట ట్రైలర్ పై పూరి జగన్నాథ్ రియాక్షన్ ఏంటనేది డైరెక్టర్ పరశురామ్ బయటపెట్టాడు. సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొన్న పరశురామ్.. “ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ మెసేజ్ పూరి దగ్గరి నుండే వచ్చింది. ట్రైలర్ లో డైలాగ్ తో.. థిస్ ఐస్ మహేష్ చేపలుప్పాడ బీచ్ సర్.. అంటూ ఫైర్ సింబల్స్ పెట్టి.. అదిరింది అన్నాడు” అని చెప్పాడు. ప్రస్తుతం పూరి రియాక్షన్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా మే 12న రిలీజ్ కాబోతుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.