ఓ డబ్బింగ్ సినిమాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన KGF చిత్రం చాప్టర్ 1 ఎవ్వరు ఊహించని రేంజ్‌లో భారీ విజయాన్ని సాధించింది. దాంతో సినిమా సీక్వెల్‌పై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా.. దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఫ్యాన్స్‌ని ఏ మాత్రం నిరాశకు గురి చేయకుండా.. అంతకుమించి అనే రేంజ్‌లో చాప్టర్ 2ని తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు మందుకు వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2.. రికార్డ్ స్థాయి కలెక్షన్లు వసూలు చేస్తూ.. సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలై కేవలం 15 రోజులే అవుతున్నప్పటికి.. కళ్లు చెదిరే కలెక్షన్లతో.. దూసుకుపోతుంది. ఈ పదిహేను రోజుల్లో KGF 2 సినిమా రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ను సాధించి బాలీవుడ్ సినిమాలకు సైతం చెమటలు పట్టించింది.
ఇది కూడా చదవండి: సలార్‌లో ప్రభాస్‌తో నా రోల్ ఇదే: KGF తాత
రూ.1000 కోట్ల రూపాయల వసూళ్లను పాన్ ఇండియా రేంజ్‌లో సాధించడం అంటే అంత సులువు కాదు. ఇప్పటి వరకు.. ఇండియన్ సినిమా హిస్టరీలో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. అవి అమీర్ ఖాన్ ‘దంగల్’.. ప్రభాస్ ‘బాహుబలి 2’.. రామ్ చరణ్ -ఎన్టీఆర్ నటించిన RRR. ఇప్పుడు ఆ సినిమాల సరనస.. 1000 కోట్ల క్లబ్‌లో చేరి.. ఆ రికార్డు సాధించిన నాలుగో చిత్రంగా KGF 2 నిలిచింది. పదిహేను రోజులకుగానూ ఈ చిత్రం రూ.1062 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.
ఇది కూడా చదవండి: KGF లో వేల మంది చనిపోయారు! షాకింగ్ సీక్రెట్స్ చెప్పిన రియల్ KGF మైనింగ్ ఇంజినీర్ఇక శాండిల్ వుడ్ చరిత్రలో1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం KGF 2. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనాటాండన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కలెక్షన్ల వసూళ్లలో నయా రికార్డు సృష్టిస్తోన్న KGF సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#KGF2 crosses the magic ₹1000 Crores 🔥. It’s the 4th Indian film after #Dangal, #Baahubali2, #RRR , to cross the coveted four figure mark.
Cheers to @TheNameIsYash @prashanth_neel @hombalefilms and entire team. pic.twitter.com/ef1wHX3oae— Sreedhar Pillai (@sri50) April 30, 2022