ప్రశాంత్ నీల్… ఒక్క కన్నడానే కాదు యావత్ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన వ్యక్తి. కేవలం ఐదురోజుల్లోనే కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. అయితే భాషతో సంబంధం లేకుండా ప్రశాంత్ నీల్ సినిమాకి ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కిక్ ఇచ్చే విషయం ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ప్రశాంత్ నీల్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి అనేది. అవును మీరు చదివింది నిజమే. ప్రశాంత్ నీల్ నాన్న వాళ్లది ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలోని మడకశిరలోని నీలకంఠాపురం గ్రామం.
ఇదీ చదవండి: KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బ్యాగ్రౌండ్! ఎవరీ ప్రశాంత్ నీల్?
అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డికి బంధువులు. ప్రశాంత్ నీల్ తండ్రి నీలకంఠాపురం సుభాష్ రెడ్డి.. రఘువీరారెడ్డి తండ్రికి తమ్ముడి వరస అవుతారు. అంటే ప్రశాంత్ నీల్ రఘువీరారెడ్డికి సోదరుడి వరస అనమాట. కాకపోతే ప్రశాంత్ నీల్ తల్లి కర్ణాటకకు చెందినవారు కావడంతో పేరెంట్స్ అక్కడే సెటిల్ అయిపోయారు. తన నేటివ్ ప్లేస్ గురించి ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు ఆడియన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ మనోడే అంటూ అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్స్ షురూ చేశారు. ప్రశాంత్ నీల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.