సలార్ స్వీట్ న్యూస్! డ్యూయల్ రోల్ లో ప్రభాస్!

“బాహుబలి”.. తెలుగు సినిమా స్థితి గతులను, కలెక్షన్ స్టామినాని మార్చేసిన సినిమా. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిది. అలాగే.., డార్లింగ్ మార్కెట్ కూడా బాలీవుడ్ టాప్ హీరోల స్థాయిని మించిపోయింది. దీనితో ఇప్పుడు ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్స్ పై అందరిలో విపరీతమైన బజ్ ఏర్పడింది. దీనికి తగ్గట్టే మన రెబల్ స్టార్ కూడా వరసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రభాస్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీలో నటిస్తున్నాడు. కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. ముఖ్యంగా కేజీఎఫ్ లో హీరో ఎలివేషన్ షాట్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక కేజీఎఫ్-2 కూడా ఇంతే స్థాయిలో తెరకెక్కించాడట ప్రశాంత్ నీల్. ఈ కారణంగానే ప్రభాస్ ఈ కన్నడ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. అయితే.., ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి చెప్పుకోతగ్గ అప్డేట్ అయితే బయటకి రాలేదు. ముందుగా చిత్ర యూనిట్ ప్రభాస్ లుక్ మాత్రం రివీల్ చేసింది. కానీ.., సలార్ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ప్రభాస్ ఒక పాత్రలో యంగ్ గా కనిపించనుండగా, మరో పాత్రలో కాస్త వయసు అయిన వ్యక్తిగా కనిపించబోతున్నాడట. కథానుసారంగా ఈ రెండు పాత్రలు కూడా హై ఓల్టేజ్ ఎనర్జీతో ఉండనున్నాయట. దీనితో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

ప్రభాస్ గతంలో బాహుబలి కోసం డ్యూయల్ రోల్స్ చేశాడు. కానీ.., అందులో ఆ రెండు క్యారెక్టర్స్ ఎదురుపడే అవకాశం లేకుండా పోయింది. కానీ.., సలార్ లో మాత్రం ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య కావాల్సినన్ని యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇదే కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పుకోవాలి. ఇక వచ్చే ఏడాది ఆరంభంలో సలార్ ను విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కానీ.., కరోనా కారణంగా ఈ మూవీ షెడ్యూల్స్ ఆలస్యం అవుతూ వస్తోంది. హైదరాబాద్ లో సలార్ తదుపరి షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉన్నా.., అది ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఈ డిలే పట్టించుకోకుండా సలార్ లో ప్రభాస్ ని రాఖీ భాయ్ ని మించే ఎలివేషన్ తో చూపించడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నటీ నటులు కనిపించబోతున్నారు. మరి.., ఇన్ని ప్రత్యేకతలు నడుమ తెరకెక్కుతోన్న సలార్ మూవీ విడుదల తరువాత ఎన్ని రికార్డ్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.