బాక్సాఫీసు వద్ద RRR సినిమా కలెక్షన్ల సునామీ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ట్రిపులార్ సినిమా ఫీవర్ కొనసాగుతూనే ఉంది. రిలీజ్ అయిన 8వ రోజు కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ట్రిపులార్ సినిమాకి బ్రహ్మ రథ పడుతున్నారు. క్రిటిక్స్, సెలబ్రిటీలు కూడా దర్శకధీరుడు రాజమౌళి ట్రిపులార్ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇదీ చదవండి: వదలని RRR ఫీవర్.. ఎనిమిదో రోజు అదే క్రేజు!
కానీ, కొంత మంది మాత్రం అక్కసు వెళ్లగక్కడం చూశాం. వారిలో జాన్ అబ్రహం కూడా ఒకడు. ఏప్రిల్ 1న జాన్ అబ్రహం నటించిన అటాక్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అటాక్ సినిమా ప్రమోషన్స్ లో తామెవరకీ నంబర్ 2 కాదంటూ ట్రిపులార్ సినిమాను ఉద్దేశించి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు నేను తెలుగు సినిమాలో నటించబోను అంటూ నోరు పారేసుకున్నాడు. ఇప్పుడు అటాక్ సినిమా విడుదలైన సందర్భంగా పాత కామెంట్స్ ను తిరగతోడుతూ జాన్ అబ్రహంకు నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. బాలీవుడ్ వాళ్లు కూడా జాన్ అబ్రహంపై సెటైర్లు వేయడం గమనార్హం.
Film #Attack collected ₹2.50Cr on day1 and it’s a disaster. It’s 5th disaster in a row of #JohnAbraham! Heartily congratulations to him.🙏🏼
— KRK (@kamaalrkhan) April 1, 2022
సినిమా విషయానికి వస్తే బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బొక్కబోర్ల పడిందమే చెప్పాలి. మొదటి రోజు కలెక్షన్లు దాదాపు రూ.3 కోట్లు నెట్ వచ్చిందంటూ ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు RRR సెకెండ్ ఫ్రైడే కలెక్షన్స్ చూసుకుంటే బాలీవుడ్ బాక్సీఫీసు వద్ద 13 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంకెలు చూపిస్తూ ఇటీవల జాన్ అబ్రహం చేసిన వ్యాఖ్యలను నెటిజిన్స్ ట్రోల్ చేస్తున్నారు. కలెక్షన్లు చూస్తేనే అర్థమవుతోంది మీది ఎన్నో నంబరో అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు.. అన్ని ఇండస్ట్రీలను ఒకటి చేసి ఇండియన్ సినిమా అని చేయాలనుకుంటుంటే.. ఇలా చిచ్చులు పెడుతుంటారు కొందరు అని చురకలు వేస్తున్నారు. ఏది ఏమైనా RRR దెబ్బతో జాన్ అబ్రహం సినిమాకి హార్ట్ ‘అటాక్’ వచ్చిందనే చెప్పాలి. జాన్ అబ్రహం అటాక్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియంజేయండి.
We are trying to create a one fim industry – #Indianfilmindustry but still some are trying to create Differences.. Thanks to the audience who encouraged movies irrespective of the differences 🙏🙏 #RRRMovie #AttackMovie pic.twitter.com/74Y1FYSOqY
— Fukkard (@Fukkard) April 2, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.