Pooja Hegde About Mohenjo Daro Movie: పూజా హెగ్డే.. ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్గా వెలుగొందుతుంది. ఈ మధ్య కాలంలో వరుస ప్లాప్‌లు ఎదురైనా పూజా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి ఈ అమ్ముడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దాదాపు దక్షిణాది స్టార్ హీరోలు అందరి సరసన నటించి అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాల ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. తెలుగులో పలు చిత్రాలతో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. మరోవైపు స్పెషల్ సాంగ్స్ నటించి అవకాశం కూడా అందుకుంటుంది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు పూజా. ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ ‘కభీ ఈథ్ కభీ దివాలీ’, సర్కస్ వంటి చిత్రాల్లో నటిస్తుంది పూజా హెగ్డే. ఈ క్రమంలో ఇటీవల బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది పూజా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కెరీర్ సక్సెస్, ఫెల్యూయిర్స్పై స్పందించింది. ‘నేను నటించిన 6 సినిమాలు వరుగా హిట్ అవ్వడం నా కెరీర్ లోనే బెగ్గెస్ట్ సక్సెస్. ఇక లోయేస్ట్ పాయింట్ వచ్చేసి నా డెబ్యూ(మొహంజోదారో) చిత్రమే బాక్సాఫీసు వద్ద పరాజయం పొందడం. నా కెరీర్లో అది ఒక చెత్త సినిమాగా నిలిచింది. నా లీస్ట్ చిత్రాల్లో అది ఒక్కటే. ఆ సినిమా వల్ల నాకు ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు’’ అని చెప్పుకొచ్చింది పూజా. ఇది కూడా చదవండి: Pooja Hegde: పూజాహెగ్డే మొదటి ఆడిషన్.. అప్పుడు ఎలా ఉందో చూడండి! ‘‘ఈ సినిమా ఫ్లాప్‌తో నాపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఈ క్రమంలో తెలుగు చిత్రం అలా వైకుంఠపురంలో నాకు బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ సినిమా నా కెరీర్‌ను అద్భుతంగా మార్చింది’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా పూజా మొహంజోదారో అనే హిందీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్‌తో పూజా జతకట్టింది. ప్రస్తుతం తెలుగులో పూజా జనగనమణ మూవీతో పాటు పలు ప్రాజెక్ట్స్‌కు సైన్ చేసింది. మరి పూజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Pooja Hegde: పూజా హెగ్డే భారీ ఖర్చులకు తలలు పట్టుకున్న నిర్మాతలు!