సోయగాల విలనిజంలో హ్యాట్రిక్ – పాయల్!?.

అందాల కథానాయికలు శక్తిమంతమైన ప్రతినాయికలుగా మెప్పించడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు రమ్యకృష్ణ ‘నరసింహా’ చిత్రంలో రజనీకాంత్‌కు సవాల్‌ విసిరే ప్రతినాయికగా నీలాంబరి పాత్రలో మెప్పించారు. సంప్రదాయబద్ధమైన పాత్రలతో అలరించిన రాశి ‘నిజం’లో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో గోపీచంద్‌కు జోడీగా., వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, రెజీనా, రీతూ వర్మ, పాయల్‌ రాజ్‌పూత్‌, కాజల్‌ లాంటి వారంతా లేడీ విలన్లుగా మారి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న వారే. వెండితెరకి భారీ అందాలను పరిచయం చేసిన కథానాయికలలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఈ సొగసరి మంచి పొడగరి.  అది ఆమెకి ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది.

Huge Hot demand for Payal Rajputమోడరన్ డ్రెస్ లో, చీరకట్టులో అయినా ఈ సుందరి కుర్రాళ్ల మతులు పోగొడుతూ ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో రాణించాలంటే లక్కూ, లౌక్యం రెండూ కావాలి. లేదంటే కాస్త వెనకబడక తప్పదు. తెలుగులో పాయల్ ఆశించిన స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోతోంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల్లో ఎంట్రీ కొట్టలేకపోతోంది. ఇదే ఇప్పుడు ఆమె అభిమానులను బాధపెడుతున్న విషయం. సినిమాల సంగతి అటుంచితే తాజాగా ఆమె ఒక వెబ్ సిరీస్ ను అంగీకరించింది. ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో అలరించిన అందం పాయల్‌ రాజ్‌పూత్‌. నటిగా తొలి అడుగులోనే ప్రతినాయిక ఛాయలున్న పాత్ర పోషించి మెప్పించింది. ఇటీవల ఆహాలో విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’ వెబ్‌ సిరీస్‌లోనూ వ్యతిరేక ఛాయలున్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇప్పుడు మూడోసారి ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నట్లు సమాచారం. ఆమె ‘త్రీ రోజస్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. దీంట్లో పాయల్‌ నెగటివ్‌ షెడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.