నాని, నజ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన ‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈవెంట్‌ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇక ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తన స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ఇండస్ట్రీ వేరు, రాజకీయాలు వేరు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే గత కొంతకాలంగా మెగా కుటుంబానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నరేష్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేష్‌ది ఎంతో బలమైన వ్యక్తిత్వమని.. ఆయన అంటే తనకు చాలా ఇష్టం అన్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వేడుకల్లో ఫ్యాన్స్ ఉత్సాహం లేకపోతే సభకి అందం ఉండదు. విశిష్ట అతిథులుగా వచ్చిన అభిమానులకి నా ధన్యవాదాలు. అంటే సుందరానికీ అనే సినిమా ఈవెంట్‌కి నన్ను ఆహ్వానించిన నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా హీరో నాని నటనే కాదు.. ఆయన వ్యక్తిత్వం అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. బలంగా నిలబడగలిగే వ్యక్తి.. ఆయనకి భగవంతుడు విజయాలను ప్రసాదించాలని కోరుతున్నా. ఈ సినిమా హీరోయిన్ నజ్రియా గారికి.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానం పలుకుతున్నా. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఆమెకు పేరు తీసుకుని రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: నాని సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్! ఆ వివాదమేనా ఇద్దరిని కలిపిందా?
‘‘తెలుగు చిత్ర పరిశ్రమ ఒకరి సొత్తు కాదు.. అందరి సొత్తు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నిలబడగలిగే గుండె ధైర్యం మీరు ఇచ్చారు. చిత్ర పరిశ్రమ అంటే మాది మనది.. మనందరిది. మా సినిమా బాగుండాలని కోరుకుంటాం తప్పితే.. ఎదుటివాళ్ల సినిమా పోవాలని కోరుకోం. రాజకీయ పరంగా చిత్ర సీమలో విభిన్న ఆలోచనలు ఉండొచ్చు. నరేష్ గారికి వేరే ఆలోచన ఉండొచ్చు.. నాకు వేరే ఆలోచన ఉండొచ్చు.. ఎన్ని ఉన్నాసరే.. సినిమా వేరు రాజకీయం వేరు. ఆ స్పష్టత నాకు ఉంది. కళకి కులం, మతం, ప్రాతం ఉండదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మేం సినిమాలు తీస్తాం. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుతున్నా’’ అన్నారు. పవన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Harish Shankar: భవదీయుడు భగత్ సింగ్ అసలు ఉంటుందా? హరీశ్ శంకర్ ఏమన్నారంటే..!