‘కేజీఎఫ్’ దర్శకుడితో మూవీ! క్లారిటీ ఇచ్చిన యన్టీఆర్!

తెలుగునాట మాస్ హీరోలకి ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అప్పట్లో సీనియర్ యన్టీఆర్, మధ్యలో మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు జూనియర్ యన్టీఆర్ కి మాత్రమే ఇంతటి మాస్ క్రేజ్ సాధ్యం అయ్యింది. ఇక ఈ జనరేషన్ టాప్ స్టార్ గా కొనసాగుతోన్న తారక్ సినిమాలపై సహజంగానే భారీ స్థాయిలో బజ్ ఉంటుంది. ఇందుకే యన్టీఆర్ సినిమాలకి సంబంధించిన సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు వారి ఎదురుచూపులకు బ్రేకులు వేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. యన్టీఆర్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ మూవీలో నటిస్తున్నాడు. తారక్ దీని తరువాత త్రివిక్రమ్ తో మూవీని పట్టాలెక్కిస్తాడని అంతా అనుకున్నారు. అదే యన్టీఆర్ 30వ సినిమా అని అఫీషయల్ గా కూడా అనౌన్సమెంట్ వచ్చింది. కానీ.., బయటకి తెలియని కారణాలతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. త్రివిక్రమ్ స్థానంలోకి కొరటాల శివ వచ్చాడు. సరే.., తారక్ కి కలిసొచ్చిన డైరెక్టర్ కాబట్టి ఫ్యాన్స్ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. మరి యన్టీఆర్ 31వ సినిమా ఎవరితో అనే విషయంలో మాత్రం చాలా రోజుల నుండి కన్ఫ్యూజన్ ఏర్పడింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా ఉన్నట్టా, క్యాన్సిల్ అయినట్టా అనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. అయితే.. తాజాగా తారక్ దీనీపై క్లారిటీ ఇచ్చాడు. లేటెస్టుగా ఓ ఇంగ్లీష్ డైలీతో ఫోన్ లోమాట్లాడిన యన్టీఆర్ ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఇన్నాళ్లుగా సస్పెన్స్ గా ఉన్న ‘#NTR31’ పై స్పష్టత వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో ట్రిపుల్ ఆర్ గురించి కూడా లీకులు ఇచ్చాడు నందమూరి హీరో. కొమురం భీమ్ పాత్ర కోసం 18 నెలలు ట్రైనింగ్ తీసుకున్నట్లు చెప్పారు. సుమారు 19 నెలల పాటు RRR షూటింగ్ చేశామని.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు వావ్ అనేలా ఉంటాయని తారక్ వెల్లడించారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ రావడంతో తారక్ ఐసోలేషన్ లో ఉండి చికిత్య తీసుకుంటున్న విషయం తెలిసిందే.