ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. సవ్యసాచి సినిమా నుంచి నిన్నమొన్నటి హీరో సినిమా వరకు.. ఫలితాలను పక్కన పెడితే నిధికి మాత్రం అభిమానుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏకంగా పవన్ కల్యాణ్ తో కావడంతో సోషల్ మీడియాలో ఈ భామకు అటెన్షన్ ఎక్కువైంది. ఆ ఫాలోయింగ్‌ని ఉపయోగించుకుని సెలబ్రిటీలు కొన్ని పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ చేసిన ఓ ప్రమోషన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆమె ప్రముఖ క**డోమ్ కంపెనీకి పెయిడ్ ప్రమోషన్ చేసింది. ఆ ప్రొడక్ట్ గురించి వివరిస్తూ ఓ వీడియో చేసి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇదీ చదవండి: బాలీవుడ్ ఎంట్రీపై యష్ క్లారిటీ! సూపర్ పంచ్
జీవితంలో శృంగారం సాధారణం.. అందులో భాగంగా క**డోమ్ వాడటం సర్వసాధారణం. కొన్ని కంపెనీలు వారి ప్రొడక్ట్స్ ని సెలబ్రిటీలతో ప్రమోట్ చేయిస్తుంటారు. అలాగే నిధి అగర్వాల్ కూడా ఈ కంపెనీ ప్రమోషన్ చేసింది. కానీ, ఓ స్టార్డమ్ వచ్చాక మనం ఏ ప్రొడక్ట్ ను ప్రమోట్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటివి ప్రమోట్ చేస్తే మిశ్రమ స్పందనలు వస్తాయని నిధి విషయంలో మరోసారి రుజువైంది.
ఆమె ఆ కంపెనీ క**డోమ్స్ ఉపయోగం, వాటిని వాడితే కలిగే అనుభూతిని సవివరంగా వివరించంపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. కొందరైతే దారుణంగా మీరు ఉపయోగించారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు అలాంటి ప్రమోషన్స్ చేయకపోతే ఏమైందని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు మేడమ్ చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. అలాంటి ప్రమోషన్స్ మీరు చేయడం అంటే గొప్ప నిర్ణయం అనే చెప్పాలి అంటూ సమర్థిస్తున్నారు. సెలబ్రిటీలు ఇలాంటి యాడ్స్ చేయడం కొత్తేం కాదు. గతంలో సన్నీలియోన్, షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే వంటి వారు కూడా క**డోమ్స్ యాడ్స్ లో నటించారు. నిధి అగర్వాల్ ప్రమోషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.