టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్- క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర పేర్లు గత కొన్ని రోజులుగా పలు కారాణాల రీత్యా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నరేశ్- పవిత్ర లోకేశ్ తో సహజీవనం చేస్తున్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు రావడంతో నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి తెరపైకి వచ్చారు. నరేశ్ పై పలు సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. 15 రోజుల క్రితమే పవిత్రను పెళ్లి చేసుకున్నాడని.. తన తల్లి డైమెండ్ నక్లెస్ కూడా పవిత్రకు గిఫ్ట్ గా ఇచ్చినట్లు రమ్య ఆరోపిస్తోంది. అటు నరేశ్.. మూడో భార్య నుంచి తనకు ప్రాణ హాని ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆమె క్యారెక్టర్ మంచిది కాదని తన డ్రైవర్ తో ఎఫైర్ నడిపిందని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రమ్య రఘుపతి ఆరోగ్య పరిస్థితి బాలేదని.. ఆమెను సైకియార్టిస్ట్ కు చూపించాలని వాళ్ల కుటుంబసభ్యులో కోరారని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా నరేశ్ ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ చిత్ర బృందంతో కలిసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఆ షూటింగ్ లో భాగంగా మైసూర్ లో ఉన్న నరేశ్ ను రమ్య అడ్డుకునే ప్రయత్నం చేసింది. మైసూర్ హోటల్ నుంచి బయటకు వెళ్తున్న నరేశ్- పవిత్రను రమ్య రఘుపతి అడ్డుకునే ప్రయత్నం చేసింది. వారు హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చే సమయంలో బయటే ఉండి నిలదీసేందుకు ప్రయత్నించింది. కానీ, ఆమెను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో రమ్య రఘుపతి పవిత్రను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆమెను వెంటనే పోలీసులు నిలువరించారు. ఆ సమయంలో నరేశ్ కూడా రమ్యను ఉడికించే ప్రయత్నం చేశాడు. నరేశ్ తన మూడో భార్యను ఉడికించేందుకు లిఫ్ట్ లో ఎక్కుతూ ఈలలు వేస్తూ, గేలి చేశాడు. అంతేకాకుండా రమ్య రఘుపతిని చూపిస్తూ ఆమె పిచ్చిది, ఆమె ఫ్రాడ్ అంటూ ఆరోపణలు చేశాడు. కేకలు వేస్తూ.. నవ్వుకుంటూ లిఫ్ట్ ఎక్కి నరేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.