‘అఖండ’సెట్స్ లో మోక్షజ్ఞ.. బాలయ్య ఫ్యాన్స్ ఖుష్!

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ నలు దిశలా వ్యాపించేలా చేశారు నందమూరి తారక రామారావు. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తన సత్తా చాటారు. ఆయన వారసులుగా నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే బాలకృష్ణ మాత్రమే సినిమాల్లో నటిస్తూ మాస్ హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగు ఇండస్ట్రీలోకి నందమూరి వారసులుగా బాలకృష్ణ తర్వాత హరికృష్ణ తనయులు ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.

mokshnga minప్రస్తుతం ఎన్టీఆర్ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం ఇంకాస్త సమయం పడుతుందంటూ దాట వేస్తున్నారు. మరోవైపు మోక్షజ్ఞ కు అసలు నటన పై ఇంట్రెస్ట్ లేదని వ్యాపార రంగం పైనే దృష్టి పెడుతున్నాడు అనే కథనాలు కూడా వినిపించాయి. అంతే కాదు అతని ఫిజిక్ పై కూడా పలు కామెంట్స్ వినిపించాయి.

ఆ మద్య బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా బోయపాటి శ్రీనివాస్ – బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న ‘అఖండ’ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ‘అఖండ’ సెట్స్ లో మోక్షజ్ఞ సందడి చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో బాలయ్యతో మోక్షజ్ఞ అతని తల్లి వసుంధర కూడా ఉన్నారు. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.