అభిమానులకు బాలకృష్ణ సందేశం! శభాష్ బాలయ్య!

నందమూరి.. తెలుగు చలనచిత్ర రంగంలో ఈ పేరుకి ఉండే పవర్ అంతా ఇంతా కాదు. నటుడిగా, నాయకుడిగా సీనియర్ యన్టీఆర్ తెలుగు వారి ఖ్యాతిని చాటి చెప్పారు. ఇక ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోగలిగారు. నటుడిగా 35 ఏళ్లకి పైబడి బాలయ్య చేయని ప్రయోగాలు లేవు. ఆయన అందుకొని రికార్డ్స్, రివార్డ్స్ లేవు. మరోవైపు హిందుపురం ఎమ్మెల్యేగా కూడా ఈయన ప్రజల హృదయాన్ని గెలుచుకోగలిగారు. యన్టీఆర్ కొడుకుగా ఇంత సాధించారు కాబట్టే బాలయ్యకి మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక బాలయ్య పుట్టినరోజు అంటే చాలు. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. కటౌట్స్ కట్టి, కేక్ కట్ చేసి, పాలాభిషేకాలు చేస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాలలో పండగ వాతావరణం తెచ్చేస్తారు. ఈ జూన్ 10 వ తేదీ బాలయ్య పుట్టినరోజు. కానీ.., కరోనా నేపథ్యంలో ఈసారి తన పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకుంటున్నట్టు బాలయ్య ఫ్యాన్స్ కి ఓ సందేశాన్ని పంపారు.

bal 2నా ప్రాణ సమానులైన అభిమానులకు ఓ విన్నపం. ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ.., కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం. ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదిన వేడుక. దయచేసి రావద్దని మరీ మరీ తెలియచేస్తున్నాను. ఈ విపత్కాలంలో అసువులు బాసిననా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ మీ నందమూరి బాలకృష్ణ.. అంటూ ఆయన సోషల్ మీడియాలో ఓ మెసేజ్ ని పోస్ట్ చేశారు. దీంతో.., కష్టకాలంలో బాలయ్య వ్యవహరిస్తున్న తీరుకి అంతా శభాష్ బాలయ్య అంటున్నారు. నిజానికి ఇండస్ట్రీలో బాలకృష్ణ అంటేనే క్రమశిక్షణకి ఒక మారు పేరు. పరిస్థితికి తగ్గట్టు వ్యవరించాలనే సిద్ధాంతం ఆయనది. ఈ విషయంలో తాను ఎంత పద్దతిగా ఉంటాడో , తన ఫ్యాన్స్ కూడా అంతే పద్దతిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటారు. ఇలా. క్రమశిక్షణ తప్పిన ఫ్యాన్స్ పై ఆయన చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ.., అలాంటి ఘటనలు పక్కన పెడితే బాలకృష్ణకి అభిమానులు అంటే చాలా ఇష్టం. తన అభిమానులు తన మాటని దాటి ప్రవర్తించరని ఆయన నమ్మకం. దీంతో.., ఇప్పుడు కూడా బాలకృష్ణ మాటకి విలువ ఇచ్చి ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజు సంబరాలు చేయడానికి బయటకి రారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.., కరోనా కాలంలో ఉన్నతంగా వ్యవహరించిన బాలయ్య నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.