ఆ విషయంలో క్షమాపణలు చెప్పిన అక్కినేని నాగార్జున!

Bangarraju

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం బంగార్రాజు. విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకి సంబంధించి చిత్రబృందం తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న నాగ్ అందరికి క్షమాపణలు చెప్పి ఆశ్చర్యానికి గురిచేశాడు. మరి నాగ్ ఎవరికి చెప్పాడు? ఎందుకు క్షమాపణలు చెప్పాడు? అనే సందేహం రావచ్చు.

2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో నాగ్ దానికి సీక్వెల్ గా బంగార్రాజు చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. తాజాగా సినిమా రిలీజ్ గురించి నాగ్ మాట్లాడుతూ.. “సంక్రాంతి కానుకగా బంగార్రాజు మూవీ రిలీజ్ కానుంది. ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోకు చాలా ముఖ్యమైనది. అదే రోజున అన్నపూర్ణ స్టూడియో పుట్టింది. ఈ మూవీకి చక్కటి మ్యూజిక్ అందించిన అనూప్ కి స్పెషల్ థ్యాంక్స్. మీరు ఊహించుకున్న దానికంటే సినిమా బాగుంటుంది. ఈనెల 11న బంగార్రాజు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నాం’ అన్నాడు.

ఇక ప్రస్తుతం కరోనా టైం కాబట్టి ఈ వేడుకకు పెద్దఎత్తున అభిమానులను పిలవటం రిస్క్ అనే ఉద్దేశంతో.. పరిమిత సంఖ్యలో సరిపెడుతున్నామని.. క్షమాపణలు చెబుతూ ఫ్యాన్స్ ని ఫిదా చేశాడు నాగ్. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో కృతిశెట్టితో కలిపి మొత్తం ఎనిమిది మంది హీరోయిన్లు నటించినట్లు తెలుస్తుంది. జీ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా.. సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. మరి అభిమానులకు క్షమాపణలు తెలిపిన నాగ్ వినయం పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.