మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఆయన వేసే సెటైర్లు, పంచులు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలంలో నాగబాబు సోషల్ మీడియాలో తరచుగా ఆస్క్ మీ ఎనిథింగ్ అంటూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు వేసే ప్రశ్నలకు తన స్టైల్లో సమాధానం చెబుతుంటాడు. తమ ప్రత్యర్థులపై కౌంటర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా నాగబాబు.. మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశాడు. వారు వేసే ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు.
ఇది కూడా చదవండి: నిహారికను టార్గెట్ చేసిన వారిని కుక్కలతో పోల్చిన నాగబాబు!
ఈ సెషన్లో నాగబాబుకు ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలే ఎదురుయ్యాయి. వాటికి తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఓ అభిమాని.. నాగబాబును RRR లేదా KGF అని ప్రశ్నించాడు. అందుకు నాగబాబు.. ఇన్‌డైరెక్ట్‌గా చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నాగబాబు.. మరోసారి మంచు ఫ్యామిలీ మీద సెటైర్లు వేశాడంటున్నారు నెటిజనులు.
ఇది కూడా చదవండి: ఏపీ కేబినెట్ విస్తరణ.. వైసీపీ మంత్రులకు నాగబాబు రిక్వెస్ట్!
ఇంతకు నాగబాబు చెప్పిన సమాధానం ఏంటంటే.. RRR, KGF రెండు కాదు.. రీసెంట్గా వచ్చిన ఒక లెజెండరీ గ్రాఫిక్ సినిమా అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ కాకుండా ఎక్కువ శాతం గ్రాఫిక్స్ వాడిన సినిమా మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియానే. దాంతో నాగబాబు.. ఇండైరెక్ట్‌గా ఈ సినిమా గురించే కామెంట్ చేశారని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఇంకా వివాదం చల్లారలేదని కామెంట్ చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి చాటింగ్ చేసినప్పుడు కూడా నాగబాబు ఇలానే సెటైర్లు వేశాడు. ఈ మధ్యే ఒక సినిమాకు వెళ్లాను.. ఇద్దరమే ఉన్నామంటూ కౌంటర్లు వేశాడు నాగబాబు.
ఇది కూడా చదవండి: తిరుపతి రుయాలో దారుణం.. మానవత్వం మరిచిన అంబులెన్స్ సిబ్బంది!
మొత్తనికి మంచు ఫ్యామిలీ వర్సెస్ నాగబాబు వ్యవహారం మాత్రం ఇంకా వేడి మీదే ఉందనిపిస్తోంది. మా ఎన్నికలు, నాగ శ్రీను వ్యవహారం, హయ్యర్ పర్పస్ కామెంట్లు ఇలా ప్రతీ సందర్భంలోనూ నాగబాబు వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టుగానే సాగింది. ఇక ఇప్పుడు మళ్లీ నాగబాబు ఓ లెజెండరీ గ్రాఫిక్ సినిమా అంటూ మరోసారి ఇండైరెక్ట్‌గా కామెంట్స్ చేశాడు. కానీ ఇది సన్ ఆఫ్ ఇండియా సినిమా గురించేనా? కాదా? అన్నది మాత్రం క్లారిటీగా చెప్పలేదు. అభిమానులు మాత్రం… కేజీఎఫ్, త్రిపుల్ ఆర్ కాకుండా.. ఈ మధ్య కాలంలో వచ్చిన గ్రాఫికల్ మూవీ సన్నాఫ్ ఇండియానే కాబట్టి.. నాగబాబు కచ్చితంగా ఆ సినిమా గురించే మాట్లాడాడు అని అంటున్నారు. మరి నాగబాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.