తెలుగు బుల్లితెరపై ఇప్పటివరకు ఎన్నో కామెడీ, డ్యాన్స్ పర్ఫామెన్స్ కి సంబంధించిన కార్యక్రమాలు వచ్చాయి. జబర్ధస్త్ షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు, యాంకర్ అనసూయ, సుధీర్ ఇతర టీమ్ సభ్యులు ఇప్పుడు స్టార్ మాలో సందడి చేస్తున్నారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘పార్టీ చేద్దాం పుష్ప పార్ట్ 2’ లో అద్భుతమైన డ్యాన్స్ లతో పాటు కమెడియన్స్ తమదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. మెగాబ్రదర్ నాగబాబు, యాంకర్ అనసూయ జడ్జిలుగా వ్యవహరించిన ఈ షోకి సంబంధించి కొత్తగా ప్రోమో విడుదలైంది. ఇందులో భాగంగా ముక్కు అవినాష్ స్కిట్ అందరికీ భలే వినోదాన్ని పంచింది. స్కిట్ లో భాగంగా తన కొడుకుకి ఓ కల వస్తుంది.. అప్పుడే అక్కడికి ముక్కు అవినాశ్ వచ్చి నా కొడుకు కల నెరవేర్చాలని అంటాడు. సోఫాలో పడుకున్న కమెడిన్ వినయ్ లేచి జడ్జి అయిన నాగబాబుకి మీరు వార్నింగ్ ఇచ్చినట్టు కల వచ్చిందని అంటాడు. అప్పుడు అనసూయ ముక్కు అవినాష్ ని ఉద్దేశిస్తూ.. ఆ కల నెరవేరిస్తే నీ ప్రాణం పోతుందని అంటుంది. నా కొడుకు ప్రాణాలు బతికించుకోవడానికి దేనికైనా సిద్దం అంటాడు అవినాష్. స్టేజ్ పైన ఉన్న నాగాబాబు వద్దకు వస్తాడు ముక్కు అవినాష్. అదే సమయంలో జగిత్యాల అవినాశ్ ఫిక్స్ అయిపో.. అంటూ అరియానా సెటైర్ వేస్తుంది. అప్పుడు నాగబాబు తో ముక్కు అవినాష్.. ‘మిస్టర్ నాగబాబు.. ఏం అనుకుంటున్నావు నువు.. ఏంటీ ఆ లుక్కేంటీ..? ఇది కరెక్ట్ కాదు.. అంటూ వేలు చూపిస్తాడు.. చివర్లో అందరికీ ట్విస్ట్ ఇస్తూ.. నాగబాబు కాళ్లు పట్టుకొని ఇదే కరెక్ట్’ అనడంతో అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వుతారు. మొత్తానికి ఈ ప్రోమో నవ్వులు పూయిస్తోంది. మరి అవినాష్ స్కిట్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: Kiraak RP: ఆరోజు నేను పిచ్చోడిలా తిరుగుతుంటే నాగబాబు ఫోన్ చేసి..!