సమంతతో విడాకులపై పెదవి విప్పిన నాగ చైతన్య

samantha chaitanya divorce

గత కొంత కాలం నుంచి మీడియలో బాగా చక్కర్లు కొడుతున్న వార్త సమంత నాగ చైతన్య విడాకుల అంశం. ఇదే అంశంపై రోజుకొక వార్త తెర మీదకు వస్తూ అక్కనేని అభిమానులకు చెమటలు పట్టిస్తున్నాయి. కానీ వీరిద్దరి విడాకుల అంశంపై మాత్రం ఇప్పటి వరకూ అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ నొరు విప్పింది లేదు. ఈ క్రమంలోనే జోరుగా వస్తున్న రూమర్స్ కి బలాన్ని చేకూర్చినట్లు అవుతోంది.

అయితే ఇదే అంశంపై తాజాగా స్పందించారు అక్కినేని హీరో నాగ చైతన్య. లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య ఎట్టకేలకు వీరి వివాహ బంధంపై వస్తున్న రూమర్స్ పై స్పందించారు. నాపై ఎన్నో అసత్య వార్తలు వస్తున్నాయి. వాటిని చూసి ఎంతో బాధపడ్డాను. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు అని అనుకున్నా. కానీ ఎన్ని అవాస్తవాలు వచ్చినా వాస్తవాలు మాత్రమే ప్రజలకు గుర్తుపెట్టుకుంటారని అర్థమైంది. ఇక అప్పటి నుంచి నేను అలాంటి వార్తలను పట్టించుకోవడం లేదు అంటూ చెప్పుకోచ్చారు చైతు.

ఇక వీరి డైవర్స్ పై వస్తున్న వార్తలపై చైతు స్పందించటంతో అక్కినేని అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. చైతు-సాయిపల్లవి జంటగా నటించిన మూవీ లవ్ స్టోరీ. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు రేపు విడుదల కానుంది.