దక్షిణాదిలో కపూర్ లాంటి ఫ్యామిలీ నాది కావాలని అనుకున్నా : మెగాస్టార్ చిరంజీవి

ఉత్తరాది చలన చిత్రపరిశ్రమలో కపూర్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఫృథ్వీరాజ్ కపూర్ నుంచి ఇప్పటి రణబీర్ కపూర్ వరకు ఎంతో మంది స్టార్ హీరోలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలారు. చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆచార్య’ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘ఆచార్య’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటున్నారు చిరంజీవి. ఇందులో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంగ్లీష్ న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

image 1 compressed 128చరణ్ తో స్క్రీన్ పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ‘ఆచార్య’ తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. దక్షిణాదిలో తన కుటుంబాన్ని కపూర్‌ ఫ్యామిలీగా తీర్చిదిద్దాలనుకున్నానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. దక్షిణాదిలో తన కుటుంబాన్ని కపూర్‌ ఫ్యామిలీగా తీర్చిదిద్దాలనుకున్నానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. బాలీవుడ్ లో కపూర్ కుటుంబానికి ఓ ప్రాధాన్యం ఉందని, ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లంతా తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారని చెప్పారు. వారికున్న పేరు, ఫేమ్ ను చూసి తనకెంతో ముచ్చటేసిందని తెలిపారు. ఇదే విషయాన్ని ఓ సారి నా తమ్ముడు పవన్‌కల్యాణ్‌తో పంచుకున్నాను. మన కుటుంబం కూడా దక్షిణాది చిత్రపరిశ్రమలో కపూర్‌ కుటుంబంలా ఎదగాలని కోరుకుంటున్నానని చెప్పాను.

ఇది చదవండి: నేను అలాంటి ఎక్స్‌ట్రాలు చేసే రకం కాదు: మెగాస్టార్ చిరంజీవి

image 2 compressed 54దక్షిణాదిలో నా కుటుంబ సభ్యులు కూడా హీరోలుగా ఎదిగి ఎవరి ప్రత్యేకత వారు చాటుకోవాలనే ఆకాంక్ష తనలో ఉండేదని.. అందుకు తగ్గట్టుగానే మెగా హీరోలు పవన్ కళ్యాణ్ నుంచి అల్లు అర్జున్ వరకు తమ ప్రత్యేకత చాటుకుంటున్నారని సంతోషం వెల్లబుచ్చారు. నా కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసి తమకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకున్నారు. అందుకు నేనెంతో గర్విస్తున్నానని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.