రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు.. పవన్‌ కల్యాణ్‌ ను ఆత్మీయంగా కౌగిలించుకున్న మోహన్‌ బాబు

‘మా’ ఎన్నికలు జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానల్స్‌కు చెందిన సభ్యులు అందరూ పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారి వారి శిబిరాల్లో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకునే వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఎందరో వారివారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్‌ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Moahan Babu and Pawan Kalyan Hugs at MAA Elections Poling - Suman TVమా ఎన్నికల పోలింగ్‌ కేంద్రంలో ఓ దృశ్యాన్ని సినీ పెద్దలు, నటులు అందరూ తన్మయంతో చూస్తూ ఉండిపోయారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను మంచు మోహన్‌ బాబు ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఒకప్పుడు మోహన్‌ బాబుపై పవన్‌ కామెంట్లు చేయడం. పవన్‌పై మోహన్‌ బాబు కౌంటర్లు వేడయం తెలిసిన విషయమే. తాజాగా పవన్‌ ప్రసంగాల్లోనూ కొన్ని ప్రశ్నలకు మోహన్‌ బాబు సమాధానం చెప్పాలని కోరిన విషయం తెలిసిందే. అందుకు మోహన్‌ బాబు ‘ఎన్నికల తర్వాత సమాధానం చెబుతాను ముందు నువ్వు నీ సోదర సమానుడు విష్ణుకు మా ఎన్నికల్లో ఓటు వెయ్యి’ అని కోరాడు. వారి మధ్య ఎప్పుడు వాతావరణం కాస్త హాట్‌ హాట్‌గానే ఉంటుంది. మా ఎన్నికల సందర్భంగా వారిద్దరూ ఇలా కనిపించడం సినిమా వర్గాల్లో సంతోషాన్ని నింపింది.