Mithali Raj: సాధారణంగా హీరోయిన్స్ గ్లామర్ డోస్ పెంచడం గురించి మనం వింటూ ఉంటాం. కానీ.. ఈ మధ్యకాలంలో గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండేవారు సైతం గ్లామర్ తలుపులు తెరుస్తూ.. అటు ఫ్యాన్స్ ని, ఇటు సెలబ్రిటీలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇటీవలే క్రికెట్ కి గుడ్ బై చెప్పిన మిథాలీ రాజ్.. రిటైర్మెంట్ తర్వాత గ్లామర్ డోస్ పెంచిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 'శభాష్ మిథు' మూవీ ప్రమోషన్స్ లో మిథాలీ రాజ్ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. టీమిండియా మాజీ కెప్టెన్ అయినటువంటి మిథాలీ రాజ్.. ఇటీవలే తన 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు ముగింపు పలికింది. ప్రస్తుతం ఈ హైదరాబాది స్టార్ తన బయోపిక్ 'శభాష్ మిథు' ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది. మిథాలీ రాజ్ లైఫ్ స్టోరీ, కెరీర్ పై బాలీవుడ్ ఇండస్ట్రీ బయోపిక్ రూపొందించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ తాప్సి.. మిథాలీ రాజ్ రోల్ పోషించగా.. ఈ సినిమా జూలై 15న దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ కోసం స్టయిలిష్, ట్రెండీ వేర్ ధరిస్తోంది మిథాలీ రాజ్. తాజాగా జరిగిన ప్రమోషన్స్ లో స్లీవ్ లెస్ టాప్ ధరించి.. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో సెగలు రేపింది. అయితే.. మిథాలీ రాజ్ గ్లామరస్ గా కనిపించడం కొత్త కాదు. బాలీవుడ్ హీరోయిన్లను తలపించే మిథు.. గతంలో ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫొటోలన్నీ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మిథాలీ.. రెగ్యులర్ గా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను, ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది. 1999లో టీమిండియా వుమన్స్ చేసిన మిథాలీ.. భారత మహిళ క్రికెట్ కు ఆదరణ పెరగడంలో కీలక పాత్ర పోషించింది. కెరీర్లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడి.. టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసి రికార్డుకెక్కింది. ఇదిలా ఉండగా.. ప్రపంచకప్ సాధించాలనే తన కల నెరవేరకుండానే మిథాలీ రాజ్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టడం బాధాకరం. ప్రస్తుతం మిథాలీ వయసు 39 సంవత్సరాలు. మరి త్వరలోనే పెళ్లి వార్త కూడా చెప్పబోతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిథాలీ గ్లామర్ ఫోటోలకు ఫోజులివ్వడం అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి మిథాలీ రాజ్ లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by Mithali Raj (@mithaliraj) View this post on Instagram A post shared by Mithali Raj (@mithaliraj)