ఆకట్టుకుంటోన్న మానుషి చిల్లర్ నటించిన మూవీ టీజర్..

prithviraj trailer

2017 మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న మానుషి చిల్లర్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అవకాశం వస్తే సినిమాల్లో నటిస్తానని మిస్ వర్డల్ కిరీటం గెలిచిన సందర్భంలో తెలిపింది. ఆ విధంగానే తన ప్రతిభను నిరూపించుకోవడానికి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది ఈ మిస్ వరల్డ్ భామ మానుషి చిల్లర్. అయితే మొదటి సినిమాలోనే  ఏకంగా అక్షయ్ కుమార్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. అక్షయకుమార్ నటిస్తున్న ‘పృథ్వీరాజ్’ మూవీలో హీరోయిన్ గా మానుషి చిల్లర్ నటిస్తోంది.

భారతదేశంలో గొప్ప రాజుగా పేరు ప్రఖ్యాతలు పొందిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా విడదలైన ఈ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో ప్రముఖ నిర్మణా సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తోంది. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’ వంటి సూపర్‌ హిట్ సినిమాల తర్వాత అక్షయ్ నటిస్తోన్న తదుపరి చిత్రం ‘పృథ్వీరాజ్’. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో సంజయ్‌ దత్, సోనూసూద్, సాక్షి తన్వర్ లాంటి ప్రముఖులు నటిస్తున్నారు.

మానుషి చిల్లర్ ‘పృథ్వీరాజ్’ సినిమాకు సంబంధించిన టీజర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘అతను ప్రేమలో ఎంతో ధైర్యవంతుడు. యుద్ధంలో నిర్భయుడు. అతనే సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్. వచ్చే ఏడాది అతను థియేటర్ల ద్వారా మీ ముందుకు రానున్నాడు’ అంటూ టీజర్ లింకును షేర్ చేసింది. ‘పృథ్వీరాజ్’ మూవీ తర్వాత అదే బ్యానర్ లో ‘ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ అనే మరో చిత్రంలో విక్కీ కౌశల్‌ సరసన హీరోయిన్‌ గా నటించనుంది మానుషీ.