అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీలో సినిమా టిక్కెట్లు ఆన్లైన్ విక్రయాలపై ఏపీ సర్కార్ పై మండిపడ్డ విషయం తెలిసిందే. వైసీపీ నేతల పై దుమ్మెత్తి పోశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వరుస పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒంటరివాడని, అటు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇటు సొంత అన్న చిరంజీవి కూడా పవన్ చర్యలను సమర్థించడం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది.

chirgతాజాగా చిరంజీవి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాల ఆవరణలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాలలో నూతన భవనం కోసం చిరంజీవి రూ.2 కోట్లు నిధులను కేటాయించారు. చిరంజీవితో పాటు అల్లు అరవింద్‌ కుటుంబసభ్యులు, మాజీ ఎంపి మురళీమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యాలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిరంజీవి పర్యటనలో వైసీపీ మంత్రులు, నేతలు ఉండటంపై జనసైనికులు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిగా మారింది.